Latest Updates
-
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక!
సింహరాశిలో శుక్రుడి అస్తమయం, ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద, లగ్జరీ, ప్రేమకు అధిపతిగా పరిగణిస్తారు. శుక్రుని ప్రతి కదలిక వివిధ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. శుక్రుడు సింహరాశిలో అస్తమించబోతున్నాడు.
శుక్ర గ్రహ అస్తమయం ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది. ఆగస్టు 3వ తేదీన రాత్రి 7.37 గంటలకు శుక్రుడు సింహరాశిలో అస్తమించనున్నాడు. 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి వారి 2, 7వ ఇళ్లకు శుక్రుడు అధిపతి. ఇప్పుడు మేషరాశి వారి 5వ ఇంట్లో అస్తమించనున్నాడు. దీని వల్ల మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందాతారు. దాంపత్యబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్త వింటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.
వృషభం
వృషభ రాశి వారి 6వ ఇంటికి శుక్రుడు అధిపతి. ఇప్పుడు వృషభరాశి వారి 4వ ఇంట్లో అస్తమించనున్నాడు. ఈ సమయంలో వఋషభ రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.
మిథునరాశి
శుక్రుడి అస్తమించే సమయంలో మిథున రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. వ్యాపారంలో వృద్ధి అందుకుంటారు. ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కర్కాటకరాశి
వస్త్ర వ్యాపారంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉండనుంది. కొత్త ఇల్లు, కారు లాంటివి సొంతం చేసుకుంటారు. సంబంధాలు బలోపేతం అవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
ఉద్యోగంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. కొత్త ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. రక్త సంబంధిత, కంటి సంబంధిత వ్యాధులు రావొచ్చు.
కన్యరాశి
లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. చాలా రొమాంటిక్ గా ఉండటం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
తులారాశి
తులారాశి వారు కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్తారు. పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో వృద్ది చూస్తారు.
వృశ్చికరాశి
దూర ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంబంధంలో సమస్యలు వస్తాయి. ఉద్యోగులు గుర్తింపు అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. విదేశీ విద్యకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
పనిపై శ్రద్ధ పెట్టాలి. భాగస్వామితో సమస్యలు వస్తాయి. పరిశోధక రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్న వారికి బాగుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
కుంభరాశి
విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగంలో పనితీరు మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి పట్ల నమ్మకం పెరుగుతుంది.
మీనరాశి
పనిలో, డబ్బు సంపాదనలో పురోగతి లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భాగస్వామ్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications