Latest Updates
-
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే..
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే!
శ్రీకృష్ణుడి పుట్టినరోజుని కృష్ణా జన్మాష్ఠమిగా ప్రతి ఏటా హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4,2026న శ్రీకృష్ణ జన్మాష్ఠమి జరుపుకుంటున్నారు. అయితే జ్యోతిష్యశాస్త్రం పరంగా కూడా సెప్టెంబర్ 4న చాలా విశిష్ఠమైన రోజు. ఎందుకంటే ఈ రోజునే చంద్రుడు తన ఉచ్ఛ రాశి అయిన వృషభంలో, దేవగురువు బృహస్పతి తన ఉచ్ఛ రాశి కర్కాటకంలో ఉండనున్నారు.
అలాగే, సూర్యుడు సింహంలో, శుక్రుడు తన స్వంత స్థానమైన తులారాశిలో సంచరించనున్నారు. వీటికి తోడు కుజుడు, శుక్ర గ్రహాల కలయికతో అత్యంత శుభప్రదమైన నవపంచమ యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ అరుదైన గ్రహ స్థితుల కలయిక వృత్తి, వ్యాపారాల్లో పురోగతిని, ఊహించని ఆర్థిక సంపదను తీసుకురాబోతోంది. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఏయే రాశుల వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇస్తుందో చూడండి.

వృషభ రాశి
ఈ రాశి వారికి జన్మాష్టమి తెచ్చే అదృష్టం అంతా ఇంతా కాదు. చంద్రుడు మీ రాశిలోనే ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని చేపట్టినా మానసిక ప్రశాంతతతో పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడి లాభాల బాట పడతారు.
కర్కాటక రాశి
జన్మాష్టమి నాడు ఏర్పడే గ్రహాల అరుదైన కలయిక కర్కాటక రాశి వారికి మహర్దశను పట్టిస్తుంది. మీ గోచారంలో బృహస్పతి, చంద్రులు ఉచ్ఛస్థితిలో ఉండటం, సూర్యుడు ధన కారకుడిగా వ్యవహరించడం వల్ల అద్భుతమైన రాజయోగం పడుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడమే కాకుండా, భవిష్యత్తు కోసం అద్భుతంగా పొదుపు చేయగలుగుతారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ జన్మాష్టమి కెరీర్, వ్యాపార పరంగా ఒక గొప్ప మలుపు కాబోతోంది. గురు గ్రహం యొక్క సానుకూల దృష్టి మీపై ఉండటం వల్ల ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులకు పెద్ద ఆర్డర్లు, భారీ కాంట్రాక్టులు కుదిరే అవకాశం ఉంది. విదేశీ వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి లాభాలు క్యూ కడతాయి. ఉద్యోగుల నిరంతర శ్రమకు తగిన గుర్తింపు, ప్రమోషన్లు దక్కుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
ధనుస్సు రాశి
జన్మాష్టమి రోజున ఏర్పడే శుభ గ్రహాల కలయిక ధనుస్సు రాశి వారి జీవితంలో సరికొత్త వెలుగులు నింపుతుంది. మీరు వేసే కొత్త ప్రణాళికలు అద్భుతమైన విజయాలను అందిస్తాయి. వ్యాపారస్తులు అమలు చేసే వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తాయి, గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో మాధుర్యం రెట్టింపు అవుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రణాళికలు రచిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
