డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్‌.!

డబ్బు సంపాదించడం అందరికీ ఇష్టమే. కానీ అందరూ ఆ డబ్బును సమర్థవంతంగా సంపాదించలేరు. పొదుపూ చేయలేరు. కొందరు మాత్రమే సంపన్నులు అవ్వగలరు. జ్యోతిష్యం ప్రకారం ధనార్జనలో రాశుల, గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారిలో రూపాయిని కోట్లలో మార్చగల సత్తాగల ఉంటుందని.. ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వారికి అవగాహన ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటి.. సంపాదనపై వారి మనస్తత్వం ఎలా ఉంటుంది.. తెలుసుకుందాం..

these zodiac signs people are the best at doubling their money

వృషభ రాశి

వృషభ రాశిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందం, సంపద, తెలివితేటలకి ఈ గ్రహం చిహ్నం. శుక్ర గ్రహ ప్రభావంతో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటారు. లగ్జరీ లైఫ్‌లో భాగంగా తాము అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. అదేవిధంగా అలా సంపాదించిన డబ్బును ఎక్కడ పొదుపు చేయాలో వీరికి బాగా తెలుసు. లగ్జరీ లైఫ్‌ను ఎంతగా ఇష్టపడతారో.. ఖర్చుల విషయంలోనూ అంతే అప్రమత్తంగా ఉంటారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. అవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి పెట్టుబడులు, ఖర్చుల నిర్ణయం తీసుకుంటారు.

సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.!

కన్యా రాశి

కన్యారాశి వారికి బుధ గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ గ్రహం ప్రభావంతో వారు బడ్జెట్‌ను సమర్థవంతంగా రూపకల్పన చేయగలరు. అదేవిధంగా నిర్వహించగలరు. ప్రతి రోజూ తాము చేసే ఖర్చులపై పరిశీలన చేస్తుంటారు. అనవసరంగా వస్తున్న ఖర్చులను దూరం పెడతారు. మార్కెట్‌లో ధరల పెంపుదల ప్రభావం ఉన్నా.. పొదుపు పద్ధతులను మార్చుకోలేరు. తమ తెలివితేటలతో లాభాలను ఆర్జించగల సామర్థ్యం ఉంది.

వృశ్చిక రాశి

సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.!

వృశ్చిక రాశి వారికి డబ్బును ఎలా రెట్టింపు చేయాలో బాగా అవగాహన ఉంటుంది. రెట్టింపు లాభాలు వచ్చే చోట మాత్రమే పెట్టుబడి పెట్టి సంపాదనలో కుబేరలవుతారు. ఈ తెలివితేటలతో వారికి నష్టాలు వస్తాయన్న మాటే ఉండదు. పెట్టుబడి పెట్టిన చోట లాభం వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా నష్టాలు వచ్చినా.. మళ్లీ కష్టపడి సంపదను పెంచుకోగలరు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి గురు గ్రహం అధిపతిగా ఉంటుంది. సంపదకు ఈ గ్రహం అధిపతి. ఇది వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఈ ప్రభావంతో వారి కష్టార్జితానికి ఎక్కువ విలువిస్తారు. డబ్బును దుబారా చేయరు. తెలివైన నిర్ణయాలతో ధనవంతులు అవుతారు. నిరంతర శ్రమతో వైఫల్యాలను సైతం దీటుగా ఎదుర్కొంటారు.

మకర రాశి

మకర రాశి వారికి శని అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారు క్రమశిక్షణ, కష్టపడేతత్వానికి మారు పేరు. డబ్బు ఆదా చేయడంలో వీరే నంబర్‌ 1. సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఇస్తూ అనవసర ఖర్చులకి దూరంగా ఉంటారు. తమ సంపాదనతో జాగ్రత్తగా జీవిస్తారు. అలాగని డబ్బు దాచరు. సరైన చోట పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జిస్తారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, October 3, 2026, 10:41 [IST]
Desktop Bottom Promotion