Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.!
జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. విశ్వానికి అధిపతి అయిన సూర్య భగవానుడు… ఆ సమయంలో శుక్ర, బుధ గ్రహాలతో సంయోగం చెందనున్నాడు. ఎందుకంటే ఆ రెండు గ్రహాలు అక్టోబర్ 17న అక్కడే ఉండనున్నాడు. ఫలితంగా త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదం కానుంది. ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు, ఆర్థిక లాభాలు ఇలా అన్ని విధాలుగా కలిసి రానున్నాయి. మరి ఏయే రాశుల వారికి త్రిగ్రాహి యోగం కలిసి వస్తుందో చూద్దాం..

సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ శనివారం సాయంత్రం 7:57 గంటలకు కన్యారాశిని విడిచిపెట్టి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. నవంబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం 7:48 గంటల వరకు తులారాశిలోనే ఉండనున్నాడు. తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ముఖ్యంగా మూడు రాశుల వారికి గోల్డెన్ డేస్ రానున్నాయి.
మేషరాశి
త్రిగ్రాహి యోగం మేష రాశి వారికి ఎనలేని ప్రయోజనాలను తీసుకురానుంది. ప్రత్యేక ప్రయోజనాలను అందించనుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందించనున్నాయి. విజయాలు సాధిస్తారు. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. అదనపు ఆదాయానికి మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి త్రిగ్రాహి యోగం కలిసి రానుంది. కుటుంబీకులు లేదా ప్రియమైన వారితో ప్రత్యేకమైన సమయం గడిపే అవకాశం లభిస్తుంది.

వృషభ రాశి
బుధ, శుక్ర, సూర్య గ్రహాల కలయికతో వృషభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వారు ఎంచుకున్న రంగాల్లో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు త్రిగ్రాహి యోగం శుభ సమయం. అయితే వ్యాపారస్థులకు ఈ కాలం సాధారణంగానే ఉన్నా.. కష్టానికి తగిన పూర్తి ప్రతిఫలం అందుకుంటారు. దీంతో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాటితో ప్రయోజనం చేకూరుతుంది.
తులారాశి
త్రిగ్రాహి యోగం తులారాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించనుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు వ్యాపారం, ఉద్యోగపరంగా భవిష్యత్తులో ప్రయోజనాలను అందిస్తాయి. వృత్తిపరంగా ప్రమోషన్లు అందుకోవడానికి కొత్త అవకాశాలు అందుకుంటారు. కోర్టు సంబంధింత వ్యహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో పరస్పర నమ్మకం, సాన్నిహిత్యం బలపడుతుంది. వారితో మంచి సమయాన్ని గడపడంతో పాటు ప్రేమను ఆస్వాదిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
