సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగష్టు 21న శుక్ర, శని గ్రహాల అరుదైన కలయికతో సమసప్తక యోగం ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాలు ఒకే స్థానంలోకి రావడంతో వివిధ రాశుల వారిలో జీవితంలో అనేక రంగాల్లో హెచ్చుతగ్గులు కనిపించనున్నాయి. కుటుంబం, వృత్తి, ఆర్థికపరమైన విషయాలు, మానసిక స్థితిలో వివిధ మార్పులు కనిపిస్తాయి. అయితే ఈ యోగం కారణంగా ఐదు రాశుల వారి తలరాతే మారనుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ రాశుల వారికి ఎలా ఉండనుందో చూద్దాం..

conjunction of Saturn and Venus Samasaptaka Yoga on august 21st affects these zodiac signs

వృషభ రాశి..

సమసప్తక యోగం కారణంగా వృషభ రాశి వారి జీవితంలో అనుకోని మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్రహస్థితి కారణంగా అనుకోని ఖర్చులు రానున్నాయి. దీంతో మీ బడ్జెట్‌ తలకిందులవుతుంది. కానీ ఆర్ట్‌, క్రియేటివిటీ, మీడియా రంగాల్లో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో అనుకూలంగా ఉండనుంది. కష్టపడి పనిచేసే వారికి ప్రతిభ ఆధారంగా ఆర్థిక లాభం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కన్యా రాశి

శుక్ర, శని గ్రహాల కలయిక, స్థానం.. కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతుంటారు. అందులో మనసులో అనవసరమైన ఆలోచనలను తొలగించుకోవాలి. అయితే పనిచేసే ప్రదేశంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా మీ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు మీరు కొత్త అవకాశాలు అందుకుంటారు. పెరిగిన ఆత్మవిశ్వాసంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మకర రాశి

మకర రాశికి అధిపతిగా శని గ్రహం ఉండటం, శుక్రునితో కలయిక కారణంగా ఈ రాశి వారి సంబంధాల్లో కొంత ఆందోళన, అశాంతి చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలో చిన్నచిన్న విషయాలపైన మీ భాగస్వామితో గొడవలు, కోపం పెంచుకోకుండా చూసుకోవాలి. అయితే ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడటంతో కొంత ఊరట పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ ఊపందుకుంటాయి. ప్రయత్నాలు పాజిటివ్‌ రిజల్ట్స్‌ ఇస్తాయి.

conjunction of Saturn and Venus Samasaptaka Yoga on august 21st affects these zodiac signs

కుంభరాశి

కుంభ రాశి వారికి శని అధిపతిగా ఉండటం, ఇంకా ఈ గ్రహాల సంయోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఆర్థికపరమైన విషయాల్లో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంకా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇతరుల వద్ద ఉన్న మీ డబ్బు తిరిగి పొందుతారు. కానీ ప్రేమ, వైవాహిక జీవితానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకుంటూ, వారితో మెరుగైన సంభాషణ ద్వారా మీ బంధం బలపడుతుంది.

మీన రాశి

శుక్ర, శని గ్రహాల సంయోగం మీన రాశి వారి వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. వైవాహిక బంధంలో, వ్యాపార రంగంలో భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా మీకున్న సామర్థ్యంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలరు. విదేశీ వ్యవహారాలు, పరిచయాలు, వ్యాపారాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, August 20, 2026, 20:39 [IST]
Desktop Bottom Promotion