సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు

వాస్తు శాస్త్రంలో దిశలకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఇంటి పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని నమ్మకం.

అయితే కేవలం ఇల్లు ఊడ్చడం, తుడవడమే కాదు... ఆ శుభ్రం చేయడానికి మనం ఉపయోగించే వస్తువులు, వాటిని ఉంచే ప్రదేశాలు కూడా మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇల్లు తుడిచేందుకు వాడే గుడ్డ విషయంలో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Vastu Tips Why You Should Never Use Old Clothes to Mop the Floor

పాత బట్టలతో తుడుచుకోవచ్చా?

చాలా ఇళ్లల్లో పాతబడిపోయిన, చిరిగిపోయిన బట్టలను నేల తుడిచేందుకు వాడటం సర్వసాధారణం. కానీ వాస్తు ప్రకారం ఇలా చేయడం అశుభం. మురికిగా, దుర్వాసన వచ్చే పాత బట్టలతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

రోజూ వేసుకునే బట్టలను చింపి మాప్ లాగా వాడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, వృత్తిపరమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. పాత బట్టలతో తుడిస్తే దారిద్ర్యం వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, వాస్తు ప్రకారం మాత్రం ఇది ఇంటి వాతావరణాన్ని చెడగొడుతుంది.

నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం!నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం!

ఎలాంటి గుడ్డ వాడాలి?

నేల తుడవడానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన, శుభ్రమైన క్లాత్ లేదా మాప్ మాత్రమే వాడాలి. అది చిరిగిపోయి లేదా మురికిగా ఉండకూడదు. ఒకవేళ పాత గుడ్డ వాడాల్సి వచ్చినా అది శుభ్రంగా, మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలి.

మాప్‌ ను తడిగా వదిలేయకండి

ఇల్లు తుడిచిన తర్వాత తడి మాప్‌ ను అలాగే వదిలేయడం లేదా ఓ మూలన పడేయడం పెద్ద తప్పు. దీనివల్ల మురికి, దుర్వాసన పెరిగి అనారోగ్యాలు వస్తాయి. వాడిన వెంటనే మాప్‌ ను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. అలాగే వాటిని అందరికీ కనిపించేలా కాకుండా ఇంటికి దూరంగా ఒక క్రమబద్ధమైన ప్రదేశంలో భద్రపరచాలి.

ఈశాన్యం, సింహద్వారం దగ్గర వద్దు

వాస్తులో ఈశాన్య మూల దేవతా స్థానం. ఇది పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం. కాబట్టి బకెట్లు, చీపుర్లు, మురికి గుడ్డలు, మాప్‌ లను పొరపాటున కూడా ఈశాన్యంలో ఉంచకూడదు. ఈ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి.

ఇంటి సింహద్వారం గుండానే అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి, మెయిన్ డోర్ చుట్టుపక్కల లేదా తలుపు వెనుక తడి మాప్‌ లను, చెత్తను ఉంచకండి.

ఉప్పు నీటితో అద్భుత ప్రయోజనం

వారానికోసారి నేల తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు కలిపి తుడిస్తే, ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి, ప్రశాంతత చేకూరుతుందని వాస్తు నమ్మకం. ఇది ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Tuesday, October 13, 2026, 22:04 [IST]
Desktop Bottom Promotion