శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్‌, బిజినెస్‌లో సిరుల పంట.!

జ్యోతిష్యం ప్రకారం సంపద, శ్రేయస్సు, విలాసాలు, ప్రేమ, అందానికి అధిపతి శుక్రుడిని పరిగణిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం శుక్రుడు తులారాశిలో వక్రగతిలోకి ప్రవేశించాడు. దాదాపు 42 రోజుల పాటు అంటే నవంబర్‌ 14వరకు ఇదే స్థితిలో ఉండనున్నాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గమనం చేయనుంది. ఈ ప్రభావం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. మరికొన్ని రాశుల వారికి మాత్రం కెరీర్‌, బిజినెస్‌, ఆర్థిక పరమైన విషయాల్లో సిరుల పంట పండనుంది.

https telugu boldsky com astrology trigrahi-yoga-by-sun-venus-and-mercury-conjunction-benefits-to-these-signs-056409 html

కన్యా రాశి

శుక్రుడి తిరోగమనం కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదం కానుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ కష్టానికి, అంకితభావానికి ప్రతిఫలం పొందుతారు. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో పాత పరిచయాలు మీకు కలిసివస్తాయి. కొత్త ఆదాయ మార్గాలతో సంపద పెంచుకుంటారు.

డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్‌.!డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్‌.!

కుంభ రాశి

కుంభ రాశి ఈ సమయం ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తుంది. వృత్తి, ఆర్థిక పరమైన విషయాల్లో అవకాశాలు అందుకుటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఆదాయం పెరగడంతో భవిష్యత్తు బాగుంటుంది.

మకర రాశి

సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.!

మకర రాశి వారు శుక్రుడి తిరోగమనంతో మంచి రోజులు చూస్తారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు అందుకుంటారు. వ్యాపార పరంగా ఆదాయ వనరులు పెరుగుతాయి. బయట చిక్కుకుపోయిన మీ డబ్బు తిరిగి మీకు దక్కుతుంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. లేదంటే రిస్క్‌లో పడాల్సి వస్తుంది.

సింహ రాశి

తులారాశిలో శుక్రుడు వక్రగతి ప్రవేశం సింహరాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార పరంగా మెరుగైన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి లభించే మద్దతు కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం అందుకుంటారు. దీంతో ఆర్థికంగా బలపడతారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బలపడటంతో నచ్చినవి కొనుగోలు చేస్తారు. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లి సరదా జీవితం గడుపుతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. దీంతో మళ్లీ వృత్తి, వ్యాపార జీవితంలో రీఫ్రెష్‌గా ఉండగలరు. ఇంకా వ్యాపారంలో గత పరిచయాలు మీకు కలిసిపస్తాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Sunday, October 4, 2026, 11:55 [IST]
Desktop Bottom Promotion