Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల కదలికలు మన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా సంపద, ఆకర్షణ, సుఖసంతోషాలకు కారకుడైన శుక్ర గ్రహం రాశి మార్పు అత్యంత కీలకం. ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 గంటలకు శుక్రుడు సింహ రాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు.

అయితే కన్యా రాశిలో శుక్రుడు అత్యంత బలహీనంగా (నీచ స్థితిలో) ఉంటాడు. ఇదే సమయంలో, మీన రాశిలో సంచరిస్తున్న శనీశ్వరునితో శుక్రుడు దృష్టి సారించి సమసప్తక యోగం అనే యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. శుక్రుడు నీచ స్థితిలో ఉండి శనితో ఏర్పరుస్తున్న ఈ సమసప్తక యోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని కుదుపులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో వీరు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులు ఏమిటి? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ చూడండి.
మేష రాశి
ఊహించని ఖర్చులు మీదపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా డబ్బు నీళ్లలా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కెరీర్ కు సంబంధించి తొందరపడి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మేష రాశి వారు ప్రతిరోజూ శివలింగానికి భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేయడం మంచిది.
తుల రాశి
ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. ఇంట్లోని విలువైన ఎలక్ట్రానిక్ లేదా ఇతర గృహోపకరణాలు పాడవడం వల్ల మీ పొదుపు సొమ్ము భారీగా ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలోనూ ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి, ఆఫీసులో మీ పనులను పూర్తి ఏకాగ్రతతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి తులా రాశి వారు విఘ్నాలను తొలగించే వినాయకుడిని క్రమం తప్పకుండా పూజించాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఏడవ ఇంట్లో బలహీనమైన శుక్రుని సంచారం కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీ సామాజిక ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలో ఉన్నప్పుడు మీ మాటతీరు, ప్రవర్తన పట్ల తీవ్ర జాగ్రత్త వహించండి. లేకపోతే సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. ఇతరులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఏమరపాటుగా ఉంటే భారీ ఆర్థిక నష్టాలను చవిచూడక తప్పదు. మీ వృత్తి జీవితంలో మీ పైఅధికారులు మీ పనితీరును నిశితంగా గమనిస్తుంటారు. కాబట్టి ఆఫీసులో ఎలాంటి చిన్న తప్పులు, అజాగ్రత్తలకు తావివ్వకండి. మీన రాశి వారు ఈ గడ్డుకాలాన్ని సురక్షితంగా దాటడానికి శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేయడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
