పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి!

Posted By:

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే చాలామంది తల్లులకు, మహిళలకు ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న.. ఈ రోజు లంచ్ బాక్స్‌ లోకి ఏం వండాలి?. పిల్లలేమో రోజూ ఒకే రకమైన భోజనం తీసుకెళ్లడానికి ఇష్టపడరు, కాస్త వెరైటీగా, రుచికరంగా ఏదైనా చేసి పెట్టమని మారం చేస్తుంటారు. మీ ఇంట్లో దొండకాయలు ఉంటే స్పెషల్ దొండకాయ రైస్ తయారు చేసి చూడండి.

అప్పటికప్పుడు తాజా మసాలా దినుసులు వేయించి, పొడి కొట్టి చేసే ఈ వంటకం రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. ఈ కమ్మని రైస్ చేసి పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని ఇంటికి వస్తారు.

Secret Fresh Masala Dondakaya Rice Perfect Kids Lunchbox Recipe in Telugu

దొండకాయ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు

తాజా మసాలా పొడి కోసం:

వేరుశెనగ గుళ్లు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 1 లేదా 2
కాశ్మీరీ ఎండు మిర్చి - 3
సాధారణ ఎండు మిర్చి - 2
నువ్వులు - 1 టీస్పూన్

అన్నం తయారీకి:

నూనె - 2 టేబుల్ స్పూన్లు
దొండకాయలు - 250 గ్రాములు
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - పావు టీస్పూన్
ఉడికించిన అన్నం - 2 కప్పులు

రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి!

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, అందులో వేరుశెనగలు, మినపప్పు వేసి సన్నని మంటపై దోరగా వేయించండి. ఆ తర్వాత మిరియాలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. చివరగా ఎండు మిరపకాయలు, నువ్వులు వేసి కాస్త వేయించి స్టవ్ ఆపేయండి. ఇవి చల్లారాక మిక్సీ జార్‌ లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో కరివేపాకు, సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మూత పెట్టి మీడియం మంట మీద దొండకాయ ముక్కలు మెత్తబడే వరకు సుమారు 15 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

-దొండకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తాజా మసాలా పొడిని అందులో వేసి పచ్చివాసన పోయేలా 2 నిమిషాలు వేయించండి.

-ఇప్పుడు ఉడికించి చల్లార్చిన పొడిపొడి అన్నాన్ని పాన్ లో వేసి, మసాలా అంతా అన్నానికి పర్ఫెక్ట్ గా పట్టేలా 3-4 నిమిషాల పాటు బాగా కలపండి.

-అంతే ఎంతో రుచికరమైన, కమ్మని వాసనతో నోరూరించే దొండకాయ రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 29, 2026, 10:01 [IST]
Desktop Bottom Promotion