దీపావళి స్పెషల్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కారప్పూస మిక్చర్ చేసుకోండిలా..

Posted By:

దీపావళి పండుగ రానే వస్తోంది. పండుగ అనగానే ఇల్లు మొత్తం తీపి వంటకాల సువాసనలతో, దీపాల వెలుగులతో నిండిపోతుంది. ఈ రోజుల్లో బంధుమిత్రులు, అతిథుల రాక సర్వసాధారణం. అయితే, స్వీట్లు తిని బోర్ కొట్టినప్పుడు.. వేడి వేడి టీతో పాటు కరకరలాడే కారపు స్నాక్ తింటే ఆ మజాయే వేరు.

బయట మార్కెట్లో ఎన్నో రకాల నమ్‌ కీన్‌ లు దొరికినప్పటికీ, ఇంట్లో స్వయంగా చేసుకునే వాటి రుచి, శుభ్రతకు ఏదీ సాటిరాదు. మీకు నచ్చిన మసాలాలు జోడించి ఈ స్నాక్ తయారుచేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే, అతిథులు రాగానే క్షణాల్లో వడ్డించవచ్చు. ఇంట్లోనే క్రిస్పీ నమ్‌ కీన్‌ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Diwali Special How to Make Crispy Homemade Namkeen in Minutes Recipe in Telugu

కావలసిన పదార్థాలు

శనగపిండి - 2 కప్పులు
అటుకులు (పోహా) - అర కప్పు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - అర కప్పు
పసుపు, కారం, వాము - ఒక్కొక్కటి అర టీస్పూన్
చాట్ మసాలా - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
కరివేపాకు - కొద్దిగా
నీళ్లు - పిండి కలపడానికి

ఇడ్లీ, దోశలోకి హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ..యమా రుచి బాసూ..

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నెలో శనగపిండిని జల్లించి పెట్టుకోండి. అందులో పసుపు, కారం, వాము, ఇంగువ మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా ఉంటే నమ్‌ కీన్ ఆకారం సరిగ్గా రాదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి.

-స్టవ్ మీద బాండీ పెట్టి, వేయించడానికి సరిపడా నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయండి. నూనె వేడి తగ్గితే నూనె పీల్చుకుంటుంది, ఎక్కువైతే మాడిపోతుంది. కాబట్టి మీడియం మంట మీద ఉంచాలి.

-ఇప్పుడు మురుకుల పావు (జంతికల గొట్టం) తీసుకుని, సన్నని రంధ్రాలున్న బిళ్ళను పెట్టుకుని, అందులో శనగపిండి ముద్దను నింపండి.

-నూనె వేడెక్కాక, పిండిని సన్నని కారప్పూసలా నూనెలోకి ఒత్తాలి. ఇవి బంగారు రంగులోకి మారి, కరకరలాడేంత వరకు వేయించి, నూనెలోంచి తీసి ఒక పళ్లెంలో పెట్టుకోవాలి.

-ఇప్పుడు వేరొక బాండీలో కొద్దిగా నూనె తీసుకుని అటుకులను, పల్లీలను విడివిడిగా కరకరలాడేలా వేయించుకోవాలి. మంచి సువాసన కోసం కరివేపాకును కూడా వేయించి పక్కన పెట్టుకోండి.

-చివరగా, ఒక పెద్ద గిన్నెలో వేయించి పెట్టుకున్న కారప్పూసను కొద్దిగా చేత్తో విరిచి వేయండి. అందులోనే వేయించిన అటుకులు, పల్లీలు, కరివేపాకు వేసి కలపండి. పైనుండి అర టీస్పూన్ చాట్ మసాలా చల్లి, మసాలా అంతా పట్టేలా బాగా కలపండి.

-అంతే ఎంతో రుచికరమైన నమ్‌ కీన్ రెడీ.

-ఈ స్నాక్ పూర్తిగా చల్లారిన తర్వాతే గాలి చొరబడని (ఎయిర్ టైట్) డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మూత పెడితే మెత్తబడిపోతాయి.

[ of 5 - Users]
Story first published: Friday, October 30, 2026, 10:45 [IST]
Desktop Bottom Promotion