Latest Updates
-
స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి! -
కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్! -
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! -
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా? -
క్రీమీ, చీజీ కాలీఫ్లవర్ పాస్తా.. ఒకే పాత్రలో సులభంగా చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి! -
ఈ ఒక్క ఎక్సర్ సైజ్ చేస్తే 100 ఏళ్లు బ్రతకొచ్చు..న్యూరాలజిస్ట్ చెప్పిన సంచలన నిజం! -
అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు..
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే?
ఈ మధ్య కాలంలో చాలామందిలో ఆరోగ్య సృహ పెరిగి సీడ్స్ అంటే గింజలకు తమ ఆహారంలో ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు. సీడ్స్(గింజలు)తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది, శరీరానికి అవసరమైన పోషకాలు లభించి మంచి శక్తి వస్తుంది. అయితే ఆరోగ్యం బాగుండాలంటే సీడ్స్ తినడం మాత్రమే కాదు.. వాటి పోషకాలను శరీరం బాగా గ్రహించాలంటే ఎలా తినాలో కూడా తెలుసుకోవాలి.
అదేవిధంగా, గింజలు తినడానికి 1 గంట ముందు కానీ, తిన్నాక 1 గంట తర్వాత కానీ టీ, కాఫీ తీసుకోపోవడం బెటర్.ప్రతి రోజూ అన్ని గింజలు ఒకేసారి తినక్కర్లేదు.మీ శరీర అవసరాలను బట్టి వాటిని ఎంచుకుని తినవచ్చు.

ఏ గింజలు ఎలా తినాలో ఇక్కడ చూడండి
అవిసె గింజలు
హోల్ ఫ్లాక్ సీడ్స్ తినడం వల్ల కొన్నిసార్లు జీర్లం కాకుండా అలాగే బయటకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే తప్పనిసరిగా వీటిని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి మాత్రమే అవిసె గింజలను తినాలి. దీనివల్ల ఒమెగా 3 ala జీవలభ్యత పెరుగుతుంది. జీవలభ్యత అంటే..మనం తీసుకున్న మెడిసిన్ లేదా పోషక పదార్థం రక్తప్రవాహంలోకి చేరి, శరీరం ఉపయోగించుకోడానికి ఎంత మొత్తంలో అందుబాటులో ఉందో తెలిపేది.
చియా సీడ్స్
ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ సీడ్స్ ని తప్పనిసరిగా 30 నిమిషాలు నీళ్లల్లో లేదా మజ్జిగ లాంటి ద్రవపదార్థాల్లో నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. వీటి నేరుగా అంటే పొడిగా(dry)ఉన్నవి పొరపాటున కూడా తీసుకోకూడదు.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు అనేది ఖచ్చితంగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని నేరుగా తినవచ్చు. కానీ లైట్ గా రోస్ట్ చేసినా, నానబెట్టుకున్నా ఎలా తీసుకున్నా సరే బాగా నమిలి తినాలి.
నువ్వులు
కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండి ఆడవారికి ఎంతో ఉపయోగపడే నువ్వులను అయితే..కొద్దిగా వేయించి, గ్రైండ్ చేసి కూరల్లో వేసుకోవచ్చు, లడ్డూల్లా చేసుకోవచ్చు. నానబెట్టి తిన్నా, చట్నీలా చేసుకుని తిన్నా కూడా దీని జీవలభ్యత పెరుగుతుంది. ఆడవాళ్లు తమ రోజువారీ ఆహారంలో నువ్వులను తప్పనిసరిగా చేర్చుకోవాలి.ః

సబ్జా గింజలు
పూర్తిగా నానబెట్టిన తర్వాత జెల్ మాదిరిగా అవుతుంది. అలా వచ్చిన తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి. సబ్జా గింజలు తీసుకుంటున్నప్పుడు నీళ్లు మాత్రం బాగా తాగాలి. లేకుంటే కడుపు ఉబ్బరం, మలబద్దకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
హలీమ్ సీడ్స్ లేదా అలీవ్ సీడ్స్
ఐరన్ పుష్కలంగా దొరికే హలీమ్ సీడ్స్ ని తప్పనిసరిగా రాత్రి మొత్తం నీటిలో నాబెట్టి, పొద్దున్నే అందులో నిమ్మకాయం రసం పిండుకుని నీటితో పాటు తినాలి. దీని వల్ల శరీరానికి ఐరన్ శోషణ(iron absorption) పెరుగుతుంది
హెంప్ సీడ్స్(hemp seeds)
వెజిటేబుల్ సలాడ్స్ లో లేదా పెరుగులో హెంప్ సీడ్స్ ని డైరెక్ట్ గాచల్లుకొని తినవచ్చు. జ్యూస్ లలో లేదా జావలలో వీటిని ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు
పుచ్చ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు
వీటిని లైట్ గా వేయించి తీసుకోవచ్చు, కానీ వీటిని బాగా నమిలి తినడం ముఖ్యం
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
