Latest Updates
-
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి! -
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ -
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్ -
పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి! -
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే? -
స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి! -
కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్! -
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! -
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా?
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు..
చికెన్ తో రకరకాల వెరైటీలు చేసుకుంటుంటారు. అయితే మీరెప్పుడైనా చికెన్ మజ్జిగ పులుసు టేస్ట్ చేశారా? ఒక్కసారి రుచి చూశారంటే ఇక ప్రతి వారం ఇంట్లో తప్పనిసరిగా ఉండాలని అనుకోవడం ఖాయం. దీని తయారీకి పెద్ద సమయం కూడా పట్టదు. బ్యాచిలర్స్ కూడా దీనిని ఈజీగా చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ చికెన్ మజ్జిగ పులుసు కలపుకుని తింటుంటే స్వర్గంలా అనిపిస్తుంటే. ఇడ్లీలు, చపాతీలతో కూడా చికెన్ మజ్జిగ పులుసు అద్బుతంగా ఉంటుంది. చికెన్ మజ్జిగ పులుసు మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చికెన్ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్ ముక్కలు
-పెరుగు
-అల్లం
-వెల్లుల్లి
-పచ్చిమిరపకాయలు
-ఉల్లిపాయ
-ఎండుమిరపకాయలు
-ఆవాలు
-జీలకర్ర
-నూనె
-కరివేపాకు
-గరం మసాలా
-ధనియాల పొడి
-పసుపు
-ఉప్పు

చికెన్ మజ్జిగ పులుసు తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా వేగి తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసి,ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి.
-తర్వాత అందులో కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మొత్తం ముక్కలకు పట్టేలా గరిటతో కలుపుకోండి. బాండీ మీద మూతపెట్టి 5 నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వాలి.
-చికెన్ ముక్కలలో నుంచి నీళ్లు రావడం స్టార్ట్ అయిన తర్వాత అందులో కరివేపాకు వేసి కలిపి దగ్గరగా అయ్యేవరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్
-చికెన్ ముక్కలు లైట్ గా బ్రౌన్ కలర్ లోకి రావాలి. అప్పుడు అందులో పసుపు, అర టీస్పూన్ గరం మసాలా పొడి, పావు టీస్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. మూతపెట్టి తక్కువ మంట మీద చికెన్ ముక్కలలో నుంచి ఆయిల్ తేలేంతవరకు, కనబడేంతవరకు వేయించుకోవాలి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి.
-చికెన్ ముక్కలు బాగా వేగి కలర్ మారిన తర్వాత స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఆ చికెన్ ముక్కల మీద కమ్మని పెరుగు పోసి, కొంచెం నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోండి.
-తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయల ముక్కలు వేసి వేయించాలి.
-వేగిన తాలింపుని చికెన్ మజ్జిగపులుసులో కలుపుకోవాలి.
-అంతే చికెన్ టేస్టీ చికెన్ మజ్జిగ పులుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
