Latest Updates
-
పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి! -
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే? -
స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి! -
కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్! -
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! -
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా? -
క్రీమీ, చీజీ కాలీఫ్లవర్ పాస్తా.. ఒకే పాత్రలో సులభంగా చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి!
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్
ప్రియుడితో కులుకేందుకు కట్టుకున్న భర్తలనే భార్యలు చంపేస్తున్న ఘటనలు కొంతకాలంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో మహిళ కూడా ఈ లిస్ట్ లో చేరింది. జిమ్ ట్రైనర్ తో ప్రేమలో పడి, భార్తను చంపేందుకు పెద్ద స్కెచ్ వేసింది. అయితే ట్విస్ట్ ఏంటంటే..అతడికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నట్టున్నాయి..కొన ఊపిరితో బయటపడ్డాడు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ శివార్లలో ఉండే ఘజియాబాద్ సిటీలో ప్రియా శర్మ(32), శషాంక్ కంతారియా(35) దంపతులు నివపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వీరికి పెళ్లవగా..ఇప్పుడొక కూతురు ఉంది. శాషాంక్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి కాగా, ప్రియా శర్మ కూడా ఉద్యోగం చేస్తుంది. ప్రియ శర్మకి ఇది రెండో పెళ్లి. ఎనిమిది నెలల క్రితం వరకు ప్రియా,శషాంక్ దాంపత్యంలో ఎలాంటి ఉరుములు మెరుపులు లేవు.

ఎనిమిది నెలల క్రితం ప్రియా ఒక జిమ్ లో చేరింది. అక్కడ తనకు జిమ్ లో ట్రైనర్ గా ఉన్న ప్రతాప్ సింగ్(30) అనే వ్యక్తితో పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తనకు హెల్త్ బాగాలేదంటూ తరచుగా ప్రియా సెలవు పెట్టి ఇంట్లో ఉండటం, భర్త ఆఫీసుకు వెళ్లగానే ప్రియుడైన జిమ్ ట్రైనర్ ప్రతాప్ సింగ్ ను ఇంటికి రప్పించుకునేది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం సాగుతూ వచ్చింది.
అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో శషాంక్ కి విషయం తెలిసింది. తన భార్య ..జిమ్ ట్రైనర్ తో కొనసాగిస్తున్న అక్రమ సంబంధం తెలుసుకుని బాధపడ్డాడు. ఇక అంతా ఆపేయ్..మనం ఢిల్లీ టౌన్ కి మారిపోదాం..నువ్వు జిమ్ కు వెళ్లడం మానేయ్ అని భార్యకు అర్థమయ్యేలా చెప్పాడు. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రియాకి భర్త మాటలు నచ్చలేదు. అతడిని చంపేసి తెలివిగా తప్పించుకుని ప్రియుడితో ఎంజాయ్ చేయవచ్చు అని ఫ్లాన్ చేసింది. ప్రియుడికి విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక పథకం వేశారు. వాళ్ల స్కెచ్ లో భాగంగా..అక్టోబర్ 26న ఉదయం ఎప్పుడూ జిమ్ కి వెళ్లే మాదిరిగానే ఉదయం తెల్లవారుజామున ప్రియా ఇంటి తలుపు కొంచెం తెరిచి బయటకు వెళ్లి కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ప్లాన్ ప్రకారం ప్రియుడు ప్రతాప్ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. కూతురు పక్కన నిద్రపోతున్న శషాంక్ ని తన వెంట తెచ్చుకున్న రెండు కత్తులతో దారుణంగా ఎటాక్ చేశాడు. వెంటనే మెలుకువ వచ్చి కూతురు బిగ్గరగా ఏడుస్తుండటం, శషాంక్ ఆక్రందనలు విన్న ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్లు అక్కడి చేరుకున్నారు. దీంతో పారిపోతుండగా ప్రతాప్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన శషాంక్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం శషాంక్ ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.
శషాంక్ తమ్ముడి ఫిర్యాదుతో ప్రియా, ప్రతాప్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అక్టోబర్ 27న వారిని కోర్టులో హజరుపర్చి తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.



Click it and Unblock the Notifications
