Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
మొటిమలా.?, చుండ్రా.?, పెదాలు నల్లబడ్డయా.?

''మొటిమలు చికాకను కలిగిస్తున్నాయా..? మొటిమల ముఖంతో నలుగురిలో తిరగాలంటే చిరాకనుపిస్తుందా..? ఆందోళణ చెందకండి సహజసిద్ధగుణాలు కలిగిన బాదాం పప్పు, పాలతో మొటిమల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. మీరు చేయ్యాల్సిందల్లా ఒక్కటే.., తాజా పాలలో బాదాపప్పుల మిశ్రమాన్ని కలిపి పేస్టులా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని సమస్య భాగం పై ఆప్లై చేయ్యటం వల్ల మొటిమలు త్వరగా తొలగిపోవటంతో వాటి తాలుకూ మచ్చలు కూడా మటుమాయమవుతాయి.''
చుండ్రు సమస్యా..?
''తరచూ చుండ్రు సమస్య వేధిస్తుందని దిగులు పడకండి. ఓర్పుతో సహజసిద్ధమైన చిట్కాలను పట్టిస్తే చుండ్రు బలాదూర్. అరకప్పు పెరుగులో అర స్పూన్ నిమ్మరసంతో పాటు కొబ్బరి నూనెను జోడించి తలకు పట్టించి కొద్ది సేపు మర్దనా చేయించుకోండి. ఓ అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయండి, వారానిరి మూడు సార్లు చొప్పున 8 వారాల పాటు ఈ చిట్కాను పాటిస్తే మీ జట్టుకు పట్టిన చుండ్రు తొలగిపోతుంది''
పెదాలు నల్లబడ్డాయా..?
'' పెదాల నల్లగా ఉన్నాయని నిస్తేజానికి గురికాకండి. నాణ్యమైన లిప్ కేర్ లేదా గ్లిజరిన్ ను పెదాలకు తరచూ పూయండి. తాజా వెన్న మీకు అందుబాటులో ఉంటే ఆ వెన్నలో తగినన్ని గ్లిజరిన్ చుక్కలను జోడించి పెదాలకు పట్టిచండి. ఇలా వారానికి 4-5 సార్లు చేస్తే మీ పెదాలు కాంతివంతంగా మారతాయి.''
ఎండలో తిరిగి ముఖ కాంతిని కోల్పొతున్నారా..?
''ఎండలో తిరిగి తిరిగి ముఖకాంతిని కోల్పొతున్నారా..? అయినా ఎండలో తిరగటం తప్పటం లేదా..? చింతించకండి ఎండబారిన పడి తిరిగి ఇంటికి రాగానే తాజా కీరదోస రసాన్ని ముఖం పై ఆప్లై చేసి కొద్ది సేపటి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.''



Click it and Unblock the Notifications
