Latest Updates
-
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట!
చక్కటి శరీర ఆకృతికి..అందానికి అరగంట చేస్తే చాలు...
ఏ వయసు వారికైనా, స్త్రీ పురుషులలో ఎవరికైనా నడకను మించిన వ్యాయామం లేదు. వ్యాయామాలలో నడకను రారాజుగా చెప్పుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఓ అరగంటపాటు నడిస్తే చాలా రోగాలు మనల్ని దరిచేరవు. రోజూ అరగంట నడక చక్కని ప్రత్యామ్నాయం. దీనివల్ల తీరైన ఆకృతి మాత్రమే కాదు.. అదనంగా ఎన్నో లాభాలున్నాయి. మధుమేహం, బిపి స్థూలకాయం వంటి సమస్యలను నడక ద్వారా ముందే నివారించవచ్చు. నడకను కొంతమంది బద్దకం వల్ల అశ్రద్ద చేస్తారే తప్ప నడక ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదయం పూట వాకింగ్ చేయడానికి సాధ్యం కాని వారు కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు. అవేమిటో చూద్దాం...

1. ఆఫీసుకు వాహనంలో వెళ్ళినప్పుడు వాహనాన్ని కొంచెం దూరంలో పార్క్ చేసి ఆఫీసు దాకా నడక సాగించండి.
2. దగ్గర్లోని మార్కెట్ కు వెళ్ళినప్పుడు వాహనాన్ని తీసుకు వెళ్లకుండా నడిచి వెళ్లిరండి. ఒక వేళ మార్కెట్ దూరంగా ఉంటే మార్కెట్ కు కొద్ది దూరంలో వాహనాన్ని పార్క్ చేసి అక్కడి దాకా కాళ్లకు పనిచెప్పండి.
3. మధ్యాహ్నాం ఆఫీసులో లంచ్ చేసిన తర్వాత కొలీగ్స్ తో చిట్ చాట్ కటిపెట్టి, అలా కొద్దిసేపు బయటకు వెళ్లి నడవండి. భోజనం చేసిన తర్వాత నడక ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
4. సెల్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూర్చోకుండా నడుస్తూ మాట్లాడండి. ఇదీ ఒక రకంగా వాకింగే అవుతుంది.
5. ఉదయం అరగంట నడవడం సాధ్యపడకపోతే అల్పాహారం తర్వాత పది నిమిషాలు, మద్యాహ్నం భోజనం తర్వాత మరో పది నిమిషాలు, రాత్రి డిన్నర్ తర్వాత పదినిమషాల చొప్పున వాకింగ్ చేయండి. తీసుకున్న ఆహారం జీర్ణం కూడా అవుతుంది.
6. రాత్రి భోజనం తర్వాత కుటుంబ సభ్యులంతా సరదాగా కొద్ది దూరం కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేయవచ్చు. మీ పెంపుడు జంతువును కూడా మీతోటే తీసుకువెళ్లవచ్చు.
7. వాకింగ్ చేయడానికి ముందు, తర్వాత బాగా నీరు తాగాలి. చెమట బాగా పడితే శరీరానికి అవసరమైన పోషక విలువల కోసం ఎనర్జీ డ్రింక్ తీసుకోండి. వాకింగ్ కు ముందు, తర్వాత బరువు చూసుకోవడం వల్ల మన వాకింగ్ ఏ మేరకు ఫలితం ఇస్తోందో తెలుసుకోవచ్చు.
8. ఏ మాత్రం విశ్రాంతి లేకుండా అదేపనిగా పనిచేయడం వల్ల సాయంత్రానికి అలసట. తరచూ ఇదే పరిస్థితి అయితే. ఒత్తిడి తప్పదు. అది ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కాసేపు నడవడానికి ప్రయత్నించండి. రోజూ కనీసం అరగంట నడవడం వల్ల జీవక్రియల సమస్యలు అదుపులో ఉంటాయి. దానివల్ల గుండెజబ్బులు, మధుమేహం, లాంటివి దరిచేరకుండా ఉంటాయి.
9. రాత్రిళ్ళు కంటి నిండా నిద్రపోవాలంటే శరీరానికి నడక ఉండాలంటున్నారు నిపుణుల. ముఖ్యంగా శరీరమంతా వేగంగా కదిలిస్తూ నడవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. దాని వల్ల శరీరానికి మేలు చేసే సెరటోనిన్ హార్మోను విడుదలవుతుంది. అది అలసిన మనసుకు సాంత్వన నందిస్తుంది. నిద్రపట్టేలా చేస్తుంది.
10. ఉదయాన్నే నడవడం వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దానివల్ల శరీరానికి తాజా ప్రాణవాయువు అందుతుంది. కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. వేగంగా నడవడం వల్ల శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అందుతుంది. రక్తప్రసరణ కూడా క్రమబద్దమవుతుంది.



Click it and Unblock the Notifications
