Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సమతుల్య ఆహారంతో సహజసిద్దమైన అందం...!

మనిషి అందంగా కనిపించడానికి బాహ్య సౌందర్యమే కాదు మనసుకూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే అది నిజమైన అందం అంటున్నారు నేటి కుర్రకారు. ప్రస్తుత జనరేషన్ లో అందానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ ట్రెండ్ లో ఫ్యాషన్ అనిపించుకోవాలంటే మంచి దుస్తులతో పాటు గ్లామర్ గా కనిపించడమూ పరిపాటే. మనసుకు ఇంపైన సౌందర్యాన్ని అందం అంటాం. శరీర అవయవ అందాన్ని మనసుతో చూస్తాం. అందము ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంటుంది. ప్రతి మనిషి ఆడ, మగ అందరూ అందంగా ఉండాలని అనుకుంటారు. ఉండాలని ప్రయత్నమూ చేస్తారు. అందమంటే శారీరక సౌందర్యమే కాదు, మానసికంగాను, ఉల్లాసముగాను ఉండాలి. అప్పుడే పూర్తి అందంగా కనిపిస్తా.
ఆడ, మగ ఎవరైనా సరే అందంగా కనిపించాలంటే అందుకు మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధతీసుకోవాలి. బాహ్యసౌందర్యం బాగుండాలంటే శరీరంలో అందుకు తగిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. సమతుల్యమైన ఆహారము తీసుకోవాలి. విటమినులు ఉన్న ఆహారము తీసుకోవాలి. యాంటి యాక్సిటెంట్లు తీసుకుంటే శరీర కాంతి నిగనిగ లాడుతుంటుంది. క్రొవ్వు పదార్థములు తక్కువగా తీసుకోవాలి. వేళకు నిద్ర., వేళకు ఆహారము, రోజూ వ్యాయామం వంటివి ఆచరించాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడడం తగ్గించుకోవాలి. ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ కు గురికాకూడదు. ప్రతి రోజు మృదువైన సబ్బుతో స్నానం చేయాలి. ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించడం, పాజిటివ్ గా ఉండటం అలవర్చుకోవాలి. అప్పుడే మనకు అందంతో పాటు ఆనందం కలుగుతుంది.



Click it and Unblock the Notifications