Latest Updates
-
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే! -
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం! -
కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. మీ అదృష్టం ఎలా ఉంది? - గురువారం, 18 జూన్ 2026 -
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ
కొబ్బరినూనెలో దాగున్న అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్
ప్రకృతి పరంగా ప్రసాధించిన బ్యూటీ వస్తువులలో కొబ్బరి నూనె ఒక మంచి బహుమతి మనకు. కొబ్బరి నూనెను బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తారు. కొబ్బరినూనెను వివిధ రకాలు గా ఉపయోగించుకోవచ్చు మంచి ఫలితాన్ని పొందవచ్చు. బ్యూటీ విషయంలో శరీరంలో అన్ని భాగాలకు కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. మరియు దీని వలన అనేక ప్రయోజనాల పొందవచ్చు. కొబ్బరి నూనె నేచురల్ గా యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉన్నది. అలాగే lauricఆమ్లంను కూడా కలిగి ఉన్నది . ఇది జుట్టు పెరగడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ఇతర నూనె కంటే కొబ్బరి నూనె కేశాలకు అతి త్వరగా పడుతుంది. కొబ్బరి నూనె అద్భుతమైన మాయిశ్చ్యరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో ఎక్కువ సమయం మీ చర్మం తేమగా మరియు మంచి షైనింగ్ తో ఉంటుంది. ముఖ్యంగా పొడి బారిన మరియు ఏజింగ్ స్కిన్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
కొబ్బరినూనె కేశాలకు చాలా అద్భుతంగా పనిచేసి కేశాలకు మంచి షైనింగ్ తో పాటు నునుపుదాన్ని అంధిస్తుంది. కొబ్బరి నూనెలో కేశాలకు అవసరం అయ్యే ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల కేశాలు ఒత్తుగా పెరగడానికి మరియు సాఫ్ట్ గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో మరో అద్భుత గుణం చుండ్రును వదిలించే లక్షణాలను కలిగి ఉంది. ఇంకా కొబ్బరి నూనె మసాజ్ వల్ల కళ్ళ క్రింద నల్లటి వలయాలను మాయం చేయడంతో పాటు, వృద్దాప్య లక్షణాలను ఎదుర్కొంటుంది. మరి మీ అందానికి రెగ్యులర్ గా కొబ్బరి నూనె ఉపయోగించే కొన్ని చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి. వాటిని పరిశీలించండి...

హెయిర్ కండీషనర్:
పొడిబారి జుట్టు మరియు రఫ్ గా ఉన్న జుట్టు తత్వం కలవారికి కొబ్బరి నూనె ఒక అద్భుత హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది.ఇది వీరి జుట్టును మంచి షైనింగ్ తో మరియు చిక్కులేకుండా ఉండేలా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల కేశాలను సాఫ్ట్ గా ఉంచుతుంది. అందువల్ల కొబ్బరి నూనె మీ జుట్టుకు అధికంగా తేమ అంధించడానికి మరియు పొడిభారిన కఠినమైన జుట్టును నివారించడానికి కొబ్బరి నూనెను రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు.

లిప్ బామ్:
కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మాయిశ్చ్యరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక అద్భుతమైన లిప్ బామ్ గా ఉపయోగించవచ్చు. కొబ్బరినూనెను లిప్ బామ్ గా ఉపయోగించడం వల్ల పగిలన, లేదా చీలిన లేదా పొడిబారిన పెదాల నుండి ఉపశమనం పొందవచ్చు. దాంతో మీ పెదాల సున్నితంగా మరియు అందంగా, తేమగా ఉండటానికి సహాయపడుతుంది.

పొడిబారిన చేతులను సున్నితంగా మార్చుతుంది:
బేబీ స్మూత్ హ్యాండ్ పొందాలంటే కొబ్బరినూనె బెస్ట్. మీ చేతులు గరుకుగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు కొబ్బరి నూనెతో చేతులను మసాజ్ చేయండి . దాంతో మీ చేతులు అందంగా, నునుపుగా, తేమగా ఉంటాయి.

మసాజ్ ఆయిల్:
కొబ్బరి నూనె ఒక కందెన ప్రభావం కలిగి ఉంది. అందుకే కొబ్బరినూనె కేశాలకు కానీ, లేదా చర్మానికి కానీ అప్లై చేసినప్పుడు వెంటనే చర్మలోని శోషించబడుతుంది. కాబట్టి ఈ కొబ్బరినూనెను కేశాలకు, శరీరానికి మసాజ్ చేసుకోవచ్చు.

నైట్ క్రీమ్:
కొబ్బరి నూనెతో చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మంజిడ్డుగా మారుతుంది. కాబట్టి, పగలు కొబ్బరి నూనె ఉపయోగించకూడదనే సలహా. కానీ కొబ్బరినూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అనేకబ్యూటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. కాబట్టి ఒది నైట్ క్రీమ్ గా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ ఇది చర్మానికి పునరుత్తేజాన్ని కలిగిస్తుంది.

చిక్కును వదలగొడుతుంది:
మహిళలకు కేశాలను చిక్కుబడటం అనేది సహాజంగా వచ్చే సమస్య . కానీ కొబ్బరి నూనె సహాయంతో చిక్కుబడ్డ కేశాల నుండి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరినూనెలో నూటిశాతం కూడా ఉండటం వల్ల కేశాలు చిక్కుబడటాన్ని నిరోధిస్తుంది.

శరీరంమీద పగుళ్ళను నిరోధిస్తుంది:
శరీరం మీద ఏర్పడ్డ పగుళ్ళను వదిలించుకోవడానికి కొబ్బరి నూనె బాడీ బామ్ లేదా బాడీ స్ర్కబ్ గా ఉపయోగించవచ్చు. దాంతో ఇది మీ చర్మానికి తగినంత తేమను అంధించి స్మూత్ గా మరియు సిల్కీగా ఉంచుతుంది.

మేకప్ తొలగించుకోవడానికి :
కొబ్బరినూనె చాలాప ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక నేచురల్ బ్యూటీ వస్తువు. ఇది మేకప్ ను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో మీ చర్మానికి హాని కలిగించే ఎటువంటి హానీకరమైన కెమికల్స్ ఉండవు. కొబ్బరి నూనె చాలా అద్భుతంగా మేకప్ ను తొలగిస్తుంది. మరియు ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల చర్మానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది.

నెయిల్ కేర్:
కొబ్బరినూనెను నెయిల్ కేర్ లో కూడా ఉపయోగించవచ్చు. పెడిక్యూర్ చేసుకోవడంలో కొబ్బరి నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చేతి వేళ్ళ నుండిక్యూటికల్స్ ను తొలగిస్తుంది. మరియు నెయిల్ గ్రోత్ ను సహాయపడుతుంది .

షేవింగ్ క్రీమ్:
షేవింగ్ చేసిన తర్వాత చర్మం పొట్టు పొట్టుగా లేదా పొడి బారి, తేమ లేకుండా నిర్జీవంగా కనడటాన్ని నిరోధించడానికి కొబ్బరి నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. షేవింగ్ తర్వాత కొబ్బరినూనె చర్మానికి పట్టించడం వల్ల చర్మానికి తగినంత తేమను అంధిస్తుంది.



Click it and Unblock the Notifications