Latest Updates
-
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా? -
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా? -
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్!
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా..
చలికాలం వచ్చేసింది. చల్లటి గాలికి ఉదయం లేదా సాయంత్రం వేళ ఏదైనా వేడివేడిగా తాగాలనిపించడం సహజం. సాధారణంగా ఇలాంటి వాతావరణంలో మనకు ముందుగా గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. కానీ రోజూ అవే తాగి బోర్ కొట్టిందా? అయితే కాస్త కొత్తగా, ఆరోగ్యానికి మేలు చేసేలా, నోటికి రుచిగా ఉండే వేడివేడి సూప్ ఏదైనా ఉంటే అదిరిపోతుంది. అదే వెల్లుల్లి కొత్తిమీర సూప్.
చలికాలంలో ఈ సూప్ కేవలం రుచినే కాదు, జలుబు, గొంతు నొప్పి నుండి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండే అతి తక్కువ పదార్థాలతో, కేవలం ఐదు నిమిషాల్లో దీన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు. వెల్లుల్లి ఘాటు, కొత్తిమీర సువాసన, మిరియాల రుచి కలగలిసిన ఈ సూప్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు -9
కొత్తిమీర తరుగు - ఒక గుప్పెడు
మిరియాలు - 10
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న పాన్ లేదా గిన్నె పెట్టుకోండి. అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సగం తరిగిన కొత్తిమీర వేసి వేయించండి. సుమారు ఒక నిమిషం పాటు వీటిని సన్నని మంటపై వేయించాలి.
-ఇప్పుడు ఆ పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోయండి. ఆ నీళ్లలో తాజాగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిగిలిన సన్నటి కొత్తిమీర తరుగును వేసి గరిటెతో బాగా కలపండి.
-ఇప్పుడు మంటను కాస్త తగ్గించి, సూప్ ను 3 నుండి 4 నిమిషాల పాటు సన్నని సెగపై బాగా మరగనివ్వండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి, దాల్చిన చెక్క, కొత్తిమీరలోని ఔషధ గుణాలు, సువాసనలు ఆ నీటిలోకి పూర్తిగా చేరి సూప్ రుచి అమోఘంగా మారుతుంది.
-సూప్ చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేయండి. దాన్ని వేడివేడిగా ఒక బౌల్ లోకి తీసుకోండి. పైన కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే.. ఆ పులుపు, మిరియాల ఘాటు కలగలిసి అమృతంలా అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
