Latest Updates
-
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా.. -
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా? -
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా? -
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్!
వంటకు ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది?
ఉదయం వేడి వేడి దోసెలు, మధ్యాహ్నం గుమగుమలాడే కూరలు, సాయంత్రం బజ్జీలు... నూనె లేకుండా మన వంటగదిలో రోజు గడవదు. కానీ మార్కెట్లోకి వెళ్లే వేరుశెనగ, సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్, నువ్వుల నూనె.. ఇలా ఎన్నో రకాలు ఆయిల్స్ కనబడుతుంటాయి. అయితే వీటిలో ఏ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది? దేనిని ఎంచుకోవాలి? అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. వైద్య నిపుణులు మాత్రం అందరికీ ఒకే నూనె సరిపోదని, నూనె రకం కంటే వాడే విధానం, పరిమాణం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
నూనెలో ఉండే కొవ్వులు - ఏవి మంచివి?
ప్రతి వంట నూనెలో ప్రధానంగా మూడు రకాల కొవ్వులు ఉంటాయి.
-సంతృప్త కొవ్వు (Saturated fat)
-మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు (MUFA)
-పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు (PUFA)
కొబ్బరి నూనె, నెయ్యి, వెన్న వంటి వాటిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా వాడితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని తక్కువగా వాడాలి.

ఏ నూనె దేనికి వాడాలి?
నువ్వుల నూనె: ఇందులో MUFA, PUFA సమతుల్యంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. గ్రేవీ కూరలు, ఇడ్లీ పొడులకు ఇది బెస్ట్ ఆప్షన్.
వేరుశెనగ నూనె: ఇందులో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. దోసెలు, వేపుళ్లకు ఇది చాలా మంచిది.
రైస్ బ్రాన్ ఆయిల్: ఇందులో మూడు కొవ్వులు బ్యాలెన్స్ డ్ గా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఒరిజనాల్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్: ఇందులో బహుళ అసంతృప్త కొవ్వులు ఉంటాయి. దీనిని కూడా మితంగా వాడుకోవచ్చు.
కొబ్బరి నూనె, నెయ్యి: రుచి కోసం మాత్రమే వీటిని చాలా తక్కువ మోతాదులో వాడటం ఉత్తమం.
పామాయిల్,వనస్పతి: బజ్జీలు, బోండాలు వంటి రోడ్ సైడ్ ఫుడ్ లో పామాయిల్ ఎక్కువగా వాడతారు. వనస్పతి (డాల్డా)లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు శత్రువులు. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

రోజుకు ఎంత నూనె వాడాలి?
ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ 2024 గైడ్ లైన్స్ ప్రకారం.. తక్కువ శారీరక శ్రమ చేసేవారికి రోజుకు 20 గ్రాముల నూనె సరిపోతుంది. పురుషులకు 30 గ్రాముల వరకు వాడొచ్చు. (ఒక టీస్పూన్ నూనె = 5 గ్రాములు). నెలకు మీ కుటుంబం ఎంత నూనె వాడుతుందో లెక్కించుకోవడం ద్వారా వాడకాన్ని కంట్రోల్ చేయవచ్చు.
కొన్ని ముఖ్యమైన చిట్కాలు
ఎప్పుడూ ఒకే నూనె కాకుండా.. పల్లి, నువ్వుల, రైస్ బ్రాన్ నూనెలను మార్చి మార్చి వాడటం ఆరోగ్యకరం.
చేయకూడని తప్పులు: నూనెలోంచి పొగలు వచ్చే వరకు వేడి చేయకూడదు. ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వాడొద్దు.
నూనె పూర్తిగా మానేయొచ్చా?
విటమిన్ ఏ, డి, ఇ, కే లు శరీరానికి వంటబట్టాలంటే కొవ్వు పదార్థాలు అవసరం. నూనెకు బదులుగా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, ఆవిరి కుడుములు వంటివి ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి. షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు నూనెలు మార్చేముందు డాక్టర్ ని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
