చంకల్లో దుర్వాసనను నివారించే చిట్కాలు

By Super

సాధారణంగా కొంత మందిని గమనించినట్లైతే అత్యధిక చెమట, చంకల్లో దుర్వాసన వస్తుంటుంది. అందుకు కారణాలు చాలానే ఉండవచ్చు . ఉదాహరణకు : అనారోగ్యకరమైన జీవనశైలి, చంకల్లో అశుభ్రత, ఫంగస్ వృద్ధి, చంకల వద్ద అదిక కొవ్వు, హార్మోనుల అసమతుల్యత, జన్యు సంబంధ, వాతావరణం మొదలగునవి చంకల్లో దుర్వాసనకు కారణం కావచ్చు. అటువంటి దుర్వాసనకు కారణం ఏదైనా, చంకల్లో దుర్వాసనను తొలగించుకోవడం చాల ముఖ్యం. ఇతరుకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నా మరియు ఇతర చర్మవ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా దుర్వాసన రాకుండా చికిత్స తీసుకోవడం చాల అవసరం.

చంకల్లో దుర్వాసను నివారించడానికి అనేక హోం రెమడీస్ మరియు సాధారణ పద్దతులు ఉన్నాయి. కొన్ని సాధారణ పద్దతులు అంటే స్నానం చేసే సమయంలో ఆ ప్రదేశంలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ సోపులను మరియు యాంటీ ఏజెంట్ సోపులను ఉపయగించి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు, మార్కెట్లో దొరికే డియోడరెంట్ మీ చర్మతత్వానికి సరిపడే వాటిని ఎంపిక చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

కొన్ని సార్లు చంకల్లో దుర్వాసనకు, మీరు ధరించే దుస్తులు కూడా కారణం కావచ్చు . మీరు ధరించే దుస్తులు, సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల లేదా వేసిన దుస్తులనే ఎక్కువ రోజులు ధరించడం వల్ల ఇటువంటి దుర్వాసనకు కారణం కావచ్చు. కాబట్టి, దుస్తులను శుభ్రపరిచే డిటర్జెంట్స్ ను కూడా ఒక సారి మార్పు చేసి చూడండి. అలాగే ఉతికి దుస్తులను ఆరుబయట ఎండలో పూర్తిగా ఆరనివ్వండి. అలాగే బిగువైన దుస్తులను ధరించడం మానుకోండి. వాతావరణంలో మార్పులు అంటే అధిక ఉష్టోగరత మరియు వేసవి కాలంలో చెమట వల్ల కూడా దుర్వాసనకు కారణం కావచ్చు.

చంకల్లో దుర్వాసనను నివారించడానికి కొన్ని సింపుల్ టిప్స్ మీకోసం...

1. ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయండి

1. ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయండి

ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయాలి. అలాగే మీ చర్మ తత్వాన్ని బట్టి బాతింగ్ సోపులను ఉపయోగించాలి. స్నానం చేసే సమయంలో కొంచెం సమయాన్ని కేటాయించి బహుమూలలు శుభ్రపరచుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల చెమట పట్టడం తగ్గుతుంది, దాంతో దుర్వాసన ఉండదు.

2. కాటన్ లేదా లెని దుస్తులు ధరించండి

2. కాటన్ లేదా లెని దుస్తులు ధరించండి

వేసవి కాలంలో మరియు వేడి వాతావరణం ఉన్నప్పుడు సింథటిక్ వస్తాలకు బదులుగా కాటన్ దుస్తులు మరియు లెనిన్ దుస్తులను ధరించండి. కాటన్ లేదా లెనిన్ దుస్తులు చెమటను చాలా తేలికగా పీల్చుకుంటాయి. మరియు గాలి ప్రసరణకు అనుమతి ఇస్తాయి. ఈ దుస్తులు ధరించడం వల్ల ఆ ప్రదేశంలో చల్లగా మరియు పొడిగా ఉంటుంది.

3. మీరు తీసుకొనే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద:

3. మీరు తీసుకొనే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద:

మీరు రెగ్యులర్ గా తినేటటువంటి ఆహారాల్లో కొన్ని చెమట పట్టేలా, దుర్వాసనకు కారణం అవుతాయి. దుర్వాసనకు కారణం అయ్యే ఆహారాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, కేఫినేటెడ్ డ్రింక్స్ మొదలైనవి. దుర్వాసనకు, ముఖ్యంగా చంకల్లో చెమట వాసనకు కారణం అయ్యే ఈ ఆహారాలను తినడం మానుకోండి .

4. యాంటీపర్స్పిరెంట్ స్ర్పేలు

4. యాంటీపర్స్పిరెంట్ స్ర్పేలు

ఈ యాంటీపర్స్పిరెంట్ లేదా డియోడరెంట్ స్ర్పేలు చంకల్లో దుర్వాసన రాకుండా నియంత్రించేందుకు సహాయపడుతాయి. ఈ యాంటీపర్స్పరెంట్ స్పేలు, స్ప్రే చేసుకొన్నప్పుడు చెమట పట్టకుండా చేస్తుంది లేదా బ్యాక్టీరియా ఉన్న ఆర్మ్ పిట్ ప్రాంతంలో డియోడరెంట్ స్ప్రే చేయడం వల్ల చెమట పట్టకుండా నివరించి, దుర్వాసనను దూరం చేస్తుంది.

5. యాంటీపర్స్పిరెంట్ పౌడర్

5. యాంటీపర్స్పిరెంట్ పౌడర్

మార్కెట్లో అనేక యాంటీపర్స్పిరెంట్ టాల్కమ్ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి, స్నానం చేసిన తర్వాత కొన్ని గంటల సేపు చెమట పట్టకుండా తాజాగా ఉంచడానికి మరియు చంకల్లో పొడిగా ఉంచడానికి ఇవి సహాయపడుతాయి. ఇవి చంకల్లో దుర్వాసన రాకుండా తప్పించడంలో సహాయపడుతాయి.

6. షేవ్ లేదా వాక్సింగ్:

6. షేవ్ లేదా వాక్సింగ్:

రెగ్యులర్ గా చంకల్లో షేవింగ్ లేదా వ్యాక్సింగ్ ద్వారా అవాంఛిత రోమాలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఇది చంకల్లో చెమట పట్టకుండా, దుర్వాసన రాకుండా ఆపవచ్చు.

7. బాగా శుభ్రపరిచిన దుస్తులను ధరించండి

7. బాగా శుభ్రపరిచిన దుస్తులను ధరించండి

కొన్ని సందర్భాల్లో చంకల్లో చెమట మరియు దుర్వాసనకు ఉతకని దుస్తులు ధరించడం లేదా ఇన్ఫెక్టెడ్ దుస్తులు ధరించడం కారణం అవుతుంది. చంకల్లో సాధారణంగా చెమట పట్టడానికి ముఖ్య కారణం మురికి దుస్తులను ధరించడమే. కాబట్టి, మంచి ఫలితాల కోసం యాంటీ బాక్టీరియల్ డిటర్జెంట్లతో క్రమం తప్పకుండా మీ బట్టలను ఉతకండి.

8. బేకింగ్ సోడా :

8. బేకింగ్ సోడా :

చంకల్లో దుర్వాసనను నివారించడానికి ఇది ఒక ప్రముఖ మరియు సాధారణ గృహ పరిష్కారం . చాలా మంది షవర్ తర్వాత చంకలోను మరియు ఆ ప్రాంతం చుట్టూ బేకింగ్ సోడాను అప్లై చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను చవిచూశారు.

9. కాటన్ పాడ్స్

9. కాటన్ పాడ్స్

మార్కెట్లో అండర్ ఆర్మ్ కాటన్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో యాంటీబ్యాక్టీరియల్ ప్యాడ్ ను ఎంపిక చేసుకొని మీరు ధరించే దుస్తుల క్రింద అమర్చుకోవాలి. ఇవి చంకల్లో స్రవించే చెమటను గ్రహిస్తాయి. మరియు బాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది .

10. వెనిగర్

10. వెనిగర్

స్మెల్లీ ఆర్మ పిట్ ను నివారించడం కోసం వెనిగర్ మరోఉత్తమ హోం రెమడీ ఏజెంట్ . కాటన్ బాల్స్ ను ఉపయోగించి చంకల్లో వెనిగర్ ను అప్లై చేయడం ద్వారా చెమట పట్టకుండా మరియు వాసనను నియంత్రించి పొడిగా మరియు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Desktop Bottom Promotion