Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వేసవిలో కళ్ళ సంరక్షణ: కళ్ళు మంటలు, పొడిబారడం నివారించుట
ముఖానికి మరింత సౌందర్యన్ని ఇచ్చేవి కళ్ళు. అంటువంటి అందమైన కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, మండుతున్న ఎండలు, ఆధునిక జీవనశైలిలో సరైన విశ్రాంతి లేకుండా రాతంబవళ్లు పని చేయడం వల్ల కన్నీటి గ్రంథుల నుంచి తగిన స్థాయిలో కన్నీరు స్రవించడం లేదని, దాని వెూతాదు తగ్గిపోతున్నదని కంటిలోని తడి ఆరిపోయి కళ్లు పొడిగా మారిపోతుంటాయి. కళ్ళు అందంగా కనబడాలంటే ఏవి పడితే అవిలోషన్ గానీ, ఆయిల్ గానీ, కళ్ళు చుట్టూ ఫేస్ ప్యాక్ లు, ఫేస్ మాస్క్ లు, ఆస్టిజెంట్స్ వాడకూడదు. ముఖంగా వేసవిలో కంటి సంరక్షణా జాగ్రత్తలు తీసుకొన్నట్లతే వేసవి తాపం నుండి కళ్ళను కాపాడుకోవచ్చు.
కళ్ళను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం
వేసవి కాలంలో చాలా మందికి కంటి సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. కళ్ళు నీరు కారడం, ఎరుపులు, మంటలు మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండడం వల్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసులు తప్పకుండా ధరించాలి. అదికూడా మీ కణతలను కవర్ చేసేటట్టు ఉండాలి. అది సూర్యుడి నుంచి వచ్చే అల్టా వయోలెట్ కిరణాల వల్ల హాని కలగకుండా కాపాడుతుంది, అలాగే దుమ్ము-ధూళి నుంచి కూడా కాపాడుతుంది. అదేవిధంగా రోజూ మూడుసార్లు చల్లని నీటితో కళ్ళను కడగాలి (లేదా కళ్ళమీద చల్లాలి). అలా చేయడం వల్ల ఎండ వేడిమికి కళ్ళలోకి ప్రవేశించే ధూళి కణాలు తొలగించబడతాయి. మురికి చేతులతో కళ్ళను నలుపుకోవద్దు, కళ్ళకి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా కంటి ఎలర్జీతో బాధపడుతున్నట్టయితే గనుక, ఏసి ముందు మాత్రం కూర్చోవద్దు. దుమ్ము-ధూళితో నిండిన ప్రదేశంలో కాంటాక్ట లెన్స్ లను మితంగా ఉపయోగించాలి. అదేవిధంగా కంటి చుట్టూ ఏదైనా ఎలర్జీ ఏర్పడినట్టయితే, అది కళ్ళకి మేకప్ వేయడం వల్ల కావచ్చు. కాబట్టి నిద్రపోయే ముందు మేకప్ పూర్తిగా తుడిచేయాలి.

వేసవిలో కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. పెరిగిన ఉష్ణోగ్రత, సూర్యుని తీవ్రత నుండి కంటిని రక్షించుకునేందుకు రంగుటద్దాలు ధరించడము మంచిది.
2. మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన ఆహారం తీసుకొని ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవాలి.
3. చాలామంది రాతపూట నిద్రరాక చాలా బాధప డుతూ ఉంటారు. అట్లాంటివారు చేయాల్సిందేమిటంటే పడుకునే ముందు ఒక లీటరు నీళ్ళల్లో లిట్టస్ ఆకులు వేసి మరిగించిన నీటిని త్రాగితే వెంటనే నిద్ర వస్తుంది.
4. వేసవిలో పొడి వాతావరణం వల్ల పెరిగిన దుమ్ము , తేమ వల్ల కళ్ళలో ఎర్రదనము వస్తుంది. వీటితో పాటుకంటిరెప్పలమీద కురుపులు వస్తాయి. కాబట్టి కంటిమీదదుమ్ము నిలవకుండ జాగ్రత్త పడాలి.
5. కంట్లో తేమ త్వరగా కొల్పోతాం కాబట్టి తరచూ కళ్ళను నీళ్ళతో కడుక్కోవాలి.
6. కంటి చుట్టుప్రక్కల ప్రదేశంలో గోకటంగానీ, రబ్ గానీ చేయరాదు.
7. కంటిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వైద్యపరీక్షకు వెళ్ళి వారి సూచనమేరకే మందులు వాడండి.
8. సొంతంగా కంటిచుక్కలు వేసుకోవడము, ఆయింట్‌మెంటును పెట్టుకోవడం చేయరాదు .



Click it and Unblock the Notifications
