Latest Updates
-
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.?
తొడల వద్ద నలుపును నివారించే ఉత్తమ చిట్కాలు
సాధారణంగా కొంత మందిలో తొడల వద్ద చారలు మరియు డార్క్ నెస్ అధికంగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తొడల వద్ద నలుపును తగ్గించవ్చు. తొడల వద్ద నలుపును నివారించడం కోసం ఇంట్లోని పదార్థాలతోనే నిమ్మ, తేనె, పసుపు, పెసరపిండి, అలోవెర, ఆలివ్ ఆయిల్ వంటి హోం రెమెడీస్ ఉపయోగించడంలో నలుపును నివారించవచ్చు. స్త్రీలు మరియు పురుషులిద్దరు కూడా ఈ చిట్కాలను ఉపయోగించి తొడల వద్ద నుపును నివారించుకోవచ్చు.

నిమ్మరసం
నిమ్మరంతో డెడ్ స్కిన్ సెల్స్ ను మరియు ఇతర మురికిని తొలగించడానికి ఉపయోగించవచ్చు. అయితే నిమ్మరసంను నేరుగా చర్మం మీద రుద్దకూడదు . ఎందుకంటే నిమ్మరసంలో అసిడిక్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మంటపుట్టించి మరియు ఎర్రగా మార్చతుంది. ఈ సమస్యను నివారించాలంటే, నిమ్మరసంలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి తర్వాత చర్మం మీద రుద్దవచ్చు. 5 నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా జెల్
అలోవెరా జెల్ ను సర్క్యులర్ మోషన్ లో మరియు యాంటీ క్లాక్ వైజ్ గా 5 నిముషాలు బాగా రుద్ది తడి ఆరే వరకూ అలాగే ఉంచాలి. ఇది మొత్తం పోషక విలువలను మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తుంది. అది మీ చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. . ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

టమోటోలు
ఇది ఒక ఉత్తమ నేచుల్ హోం రెమెడీ . ఇది మీ చర్మంను మెరుస్తుండేలా మరియు యంగ్ గా చేస్తుంది. టమోటోలో ఉండే యాంటీయాక్సిడెంట్స్ చర్మంలోని మురికిని తొలగిస్తుంది టమోటోలను ఉపయోగించడం వల్ల చర్మంలోని నూనె గ్రంథులకు మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . టమోటోను పేస్ట్ లా చేసి తొడల వద్ద 5నిముషాలు రుద్ది 20 నిముషాల తర్వాత క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం జోడిస్తే ఫలితం మరింత బెటర్ గా ఉంటుంది.

కీరదోసకాయ
కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి తొడల వద్దబాగా రుద్దాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మం లైట్ గా మార్చుతుంది మరియు కీరదోసకాయలోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు బ్లాక్స్కిన్ ను తెల్లగా మార్చుతుంది . ఈ రెమెడీ మరింత ఎఫెక్టివ్ గా చేయాలి నిమ్మరంలో అద్ది తర్వాత మర్ధన చేయాలి.

బొప్పాయి
బొప్పాయి ప్యాక్ లేదా బొప్పాయి ముక్కలతో బాగా రుద్ది శుభ్రం చేసుకోవడం వల్ల మురికి తొలగిపోవడంతో డార్క్ కలర్ కూడా తగ్గుతుంది . ఇంకా ఇది మాయిశ్చ్యరైజింగ్ గా పనిచేస్తుంది . ఈ హోం రెమెడీని అప్లై చేసి తర్వాత బ్రష్ తో రుద్ది శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం నలుపు తగ్గిపోతుంది.

తేనె
తేనె డీఫ్ మాయిశ్చ్యరైజింగ్ గా పనిచేస్తుంది. తగినంత తేమను అందిస్తుంది మరియు చర్మం సున్నితంగా మార్చుతుంది . తేనె రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల డార్క్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి . చర్మం యొక్క రంగులో మార్పు వస్తుంది. తొడల వద్ద తేనె అప్లై చేసి 5నిముషాలు బాగా మర్ధన చేయాలి కొన్ని సార్లు క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

బంగాళదుంప
బంగాళదుంపలో ఉండే ఎంజైమ్స్ నేచురల్ ఫెయిర్ నెస్ ప్రొడక్ట్స్ గా పనిచేస్తాయి . కాబట్టి, బంగాళదుంపలను తీసుకొని మొత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్ ను మీ తొడల వద్ద అప్లై చేయాలి అది ఆరిపోయే వరకూ అలాగే ఉండి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల డార్క్ నెస్ తొలగిపోతుంది చర్మం సాఫ్ట్ గా మారుతుంది . తెల్లగా మరియు బ్యూటిఫుల్ గా కనబడుతుంది.

ఆరెంజ్ జ్యూస్ ప-పసుపు
ఆరెంజ్ జ్యూస్ మరియు పసుపును మిక్స్ చేసి తొడల వద్ద అప్లై చేయాలి. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటడం వల్ల , పసుపులో యాంటీ బయోటిక్ ప్రొపర్టీస్ అధికంగా ఉండట వల్ల ఇది అధ్భుతంగా పనిచేస్తుంది . ఈ పేస్ట్ ను డార్క్ ఇన్నర్ థైస్ వద్ద అప్లై చేయాలి . తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తెల్లగా మారుతుంది.



Click it and Unblock the Notifications