Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆయుర్వేదం ద్వారా కాలి పగుళ్ళు అరికట్టడం ఎలా
అందంగా ఉండటమంటే కేవలం ముఖం మీద శ్రద్ధ చూపించడమే కాదు మీ శరీరం అపాదమస్తకం మీదా శ్రద్ధ వహించడం.మన శరీరంలో అత్యంత నిర్లక్ష్యం చెయ్యబడే శరీర భాగం పాదాలు.
కానీ మీ పాదాల మీదే రోజంతా ఒత్తిడి ఉంటుంది అందువల్ల అవి బాగా అలసిపోతాయి.మీ పాదాలకి తగినంత విశ్రాంతిని ఇవ్వడం ద్వారా మరుసటి రోజుని ఉత్సాహంగా మొదలుపెట్టవచ్చు.
సాధారణంగా పాదాలకి ఎదురయ్యే సమస్య కాలి పగుళ్ళు.పగుళ్ల మీద క్రీములు రాసే కాంటే ఆయుర్వేదం ద్వారా పగుళ్ళని ఎలా అరికట్టవచ్చో తెలుసుకోండి.
కానీ అసలు పగుళ్ళు ఎందుకొస్తాయి??దీనికి కారణం పొడి బారిన చర్మమం. మీ చర్మం పొడి బారినప్పుడు పగుళ్ళకి దారి తీస్తుంది.
చలికాలంలో ఈ సమ స్య మరింత వేధిస్తుంది.కానీ కొంతమంది మాత్రం సంవత్సరం పొడుగునా దీనితో బాధపడుతుంటారు.లోషన్లూ, క్రీములు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయి.
కానీ ఆయుర్వేదం ద్వారా పగుళ్ళని పూర్తిగా అరికట్టవచ్చు.ఈ ఆర్టిల్ ద్వారా ఆయుర్వేదం ద్వారా పగుళ్ళని అరికట్టడం ఎలాగో మీ కోసం కింద ఇచ్చాము.
కాలి పగుళ్ళు ఎక్కువయ్యి రక్తమోడే బాధ లేదింక.ఆయుర్వేదం మీ సమస్య ని పూర్తిగా పారదోలుతుంది.ఉదాహరణకి కాలి పగుళ్ళుంటే తీపి పదార్ధాలు, చక్కెర తీసుకోకూడదు.వాటి బదులు బెల్లం వాడవచ్చు.ఇక ఆయుర్వేద పద్ధతుల ద్వారా కాలి పగుళ్ళని ఎలా అరికట్టాలో చూద్దాము.

1.యోగాసనాలు:
వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. కొన్ని రకాల ఆసనాల ద్వారా కాలి పగుళ్ళని అరికట్టవచ్చు.ఉదాహరణకి చంద్ర భేదనాసనం, భస్త్రిక ప్రాణాయామం, శీత్కరీ ప్రాణాయామం, శీతలి పాణాయామం మొదలైనవి. ఇవన్నీ మీ పగుళ్ళ నివారణకి సమర్ధవంతంగా తోడ్పడతాయి.వెంటనే నిపుణులైన యోగా గురువుని సంప్రదించండి.

2.సరైన ఆహారం:
ఆయుర్వేదం ప్రకారం కాలి పగుళ్ళ నివారణకు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పగుళ్ళు నివారించాలంటే మీ ఆహారంలో రిఫైండ్ ఫ్లోర్స్ అనగా మైదా,ఉడకబెట్టిన టమాటాలు, వంకాయ, బంగాళదుంప నిషిద్ధం.కానీ వెల్లుల్లి, ఉల్లి, నెయ్యి, వెన్నలని మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు.

3.ఆయుర్వేద లేపనాలు:
అశ్వ గంధ నూనె మరియూ జాత్యాది నూనె కలిపి వెచ్చబెట్టి కషాయాన్ని తయారు చేసి పడుకోబోయేముందు పగుళ్ళ మీద రాసుకోవాలి. మీ పాదాలని కాటన్ సాక్సులతో కప్పి ఉంచడం మరిచిపోకండి సుమా.మరుసటి రోజు ఉదయం వెచ్చటి నీరు, తక్కువ గాఢత కలిగిన సబ్బుతో పాదాలు కడుక్కోండి.

4.పాదస్నానం:
మీ పాదాల చర్మాన్ని మృదువుగా మార్చుకోవాలంటే వెచ్చటి నూనెలో ఆయుర్వేద నూనెలైన లావెండర్ నూనె లేదా పచ్చౌలీ లేదా రోజ్ నూనె వేసి దానిలో కాసిని గులాబీ రేకులు కలపండి. ఓ ఇరవై నిమిషాలపాటు పాదాలు అందులో ఉంచి తియాలి. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5.తడి సాక్సులూ అవీ ధరించద్దు:
తడి షూస్ ఎలదా సాక్సులు మీ శరీరం నుండీ తేమ ని పీల్చేసుకుని చర్మాన్ని పొడి బారేటట్లు చేసి పగుళ్ళకి కారణమవుతాయి. అందువల్ల ఎప్పుడూ తడి బూట్లు లేదా సాక్సులు ధరించవద్దు.

6.చెప్పుల్లేకుండా నడవటం:
ఆయుర్వేదంలో కాలి పగుళ్ళు నయం చేయడానికి ఇది మరొక పద్ధతి.మన పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల అనేక రోగాలు నయమవుతాయి.ప్రతీరోజూ పొద్దున్నే కొంత సేపు పచ్చగడ్డిలో చెప్పుల్లేకుండా నడవటం మీ పాదాలకే కాదు కంటి చూపుకు కూడా మంచిది.



Click it and Unblock the Notifications
