Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.!
రేపటి(ఆగష్టు 11) నుంచి గజకేసరి రాజయోగం ప్రారంభం కానుంది. ఒకే రాశిలో గురు, చంద్ర గ్రహాల కలయిక కారణంగా ఈ అరుదైన యోగం ఏర్పడనుంది. అంతేకాకుండా ఇప్పటికే బుధ, సూర్య గ్రహాలు కర్కాటక రాశిలో ఉండటం, రేపు.. గురు, చంద్ర గ్రహాలు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించడంతో చతుర్‌గ్రహి యోగం సంభవించనుంది. ఈ ప్రభావంతో ఆదిత్య రాజయోగం, చంద్ర- బుధ యోగం, హస రాజయోగం, గజకేసరి రాజయోగం మొదలు కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ అరుదైన యోగాలతో మూడు రాశుల వారి జాతకం మారబోతుందని జ్యోతిష్యం చెబుతోంది.

చంద్రుడిని మనస్సు, మాతృత్వం, ఆనందం, సంపదకు అధిపతి. ఇక దేవ గురువు గురు గ్రహం. అంతేకాకుండా అత్యంత వేగంగా కదిలే గ్రహం చంద్రుడు. ఒకే రాశిలో రెండున్నరేళ్ల పాటు ఉంటాడు. దీంతో కర్కాటక, కన్య, మీనరాశి వారికి ఎనలేని ప్రయోజననం చేకూరనుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మీ లగ్నంలో చంద్రుని సంచారం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచడమే కాకుండా.. గజకేసరి రాజయోగంతో మీరు శుభవార్త వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న రోజులు ఉద్యోగస్తులకు కలిసి వస్తాయి. డబ్బు సంపాదన పెరుగుతుంది. ప్రమోషన్లు పొందే సూచనలు ఉన్నాయి. ఒకేసారి జీవితంలో సంతోషం, సంపద, ఆనందంతో రాజయోగం పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందే అవకాశాలు ఉన్నాయి.

కన్యారాశి
గజకేసరి రాజయోగం కన్యా రాశి వారికి పలు విధాలుగా కలిసివస్తుంది. మునుపటి కంటే ఇప్పుడు ఆర్థికంగా బాగుంటారు. ఎంతోకాలంగా ఇతరుల వద్ద నిలిచిపోయిన మీ డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపార, వృత్తి రంగాల్లో గణనీయమైన లాభాలు ఆర్జిస్తారు. మీరు అనుకున్నవి నెరవేరుతాయి. అంతేకాకుండా మీ కష్టానికి గుర్తింపు లభించి సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు.
మీన రాశి
మీన రాశి వారికి ఐదో స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడనున్న కారణంగా కొత్త ఉద్యోగ అవకాశాలు అందుకునే సూచనలు ఉన్నాయి. ఫలితంగా సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇప్పటికే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకోవచ్చు. ఆర్థికంగా మీ పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారి ఆశయం నెరవేరుతుంది. రీసెర్చ్ రంగంలో ఉన్న విద్యార్థులకు గజకేసరి రాజయోగం అనకూలిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉండటంతో అనుకున్న పనులు పూర్తవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
