Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.?
ఆయుర్వేద పరంగా తేనె ప్రకృతి మనకు అందించిన వరం. మన ఆరోగ్యానికి ఇది అన్ని విధాలుగా మేలు చేస్తుండటంతో చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ డాక్టర్లు బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్‌గా సిఫార్సు చేశారు. చర్మానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేసే తేనెను.. చక్కెరకు ప్రత్నామ్నాయంగానూ ఉపయోగిస్తారు. అయితే తేనె తియ్యగా ఉన్న కారణంగా డయాబెటిస్ బాధితులు దీనిని తీసుకోవచ్చా.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందా అనే సందేహం చాలా మందిలో నెలకొంటుంది. దీనిపై నిపుణుల సలహాలు చూద్దాం..

డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారిని ముందుగా తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తారు. అయితే తేనె ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండటంతో చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవచ్చా అనే డౌట్ షుగర్ బాధితులకు తప్పనిసరిగా వస్తుంది. కాగా, తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్ 58గా ఉండగా.. మధుమేహం ఉన్నవారు 55 కంటే గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తీసుకోవద్దని సూచిస్తారు.
గ్లైసెమిక్ ఇండెక్స్
ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి.. రక్తంలో చక్కెర పరిమాణం ఏ వేగంతో పెరుగుతుందనేది తెలుసుకోవచ్చు. ఈ ఆధారాన్ని పరిశీలిస్తే డయాబెటిస్ బాధితులు చక్కెరను తీసుకున్నట్లయితే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం అనేది వారి ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
చక్కెరకు ప్రత్యామ్నాయం
చక్కెరను వినియోగించని వారు తేనెను సాధారణంగా టీలో కలుపుకోవడం లేదా బేకింగ్‌లో ఉపయోగిస్తారు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి తేనె సురక్షితమేనా అంటే.. ఈ అంశాలను వారు ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వారి డైట్‌లో కార్బొహైడ్రేట్లు, చక్కెర వినియోగం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.

తేనె తీసుకోవచ్చా
చక్కెర కంటే తేనె సురక్షితమైనదే కాకుండా ఇందులో యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది డయాబెటిస్ సమస్యలను తగ్గించే అవకాశాలు ఉంటాయి. అయితే దీని వినియోగం అనేది సదరు వ్యక్తి ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుందని గమనంచాలి. ఈ క్రమంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాబెటిస్ ఉన్నప్పుడు తేనె వాడాలా వద్దా అనే విషయంలో వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తేనెలోని అధిక తీపిదనం రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచే అవకాశాలు ఉంటాయి.
మీమీ హెల్త్ కండిషన్స్ ఆధారంగా తేనెను తీసుకోవడంతో లాభాలు, నష్టాలు రెండూ ఉండొచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు పచ్చి తేనెకు దూరంగా ఉండటం వేరు. ఎందుకంటే దీనిని పాశ్చరైజ్ చేయని కారణంగా.. ఈ రకమైన తేనెను తీసుకోవడం ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
