Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు ఇప్పటికే సింహ రాశిలో ఉన్నాడు. ఈ ఛాయా గ్రహానికి తోడు.. ఈ నెల 17న అదే రాశిలోకి సూర్య సంచారం జరగనుంది. వీరిద్దరి కలయిక కొన్ని రాశుల వారికి మేలు చేస్తుండగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. వారి ఆత్మ విశ్వాసం తగ్గొచ్చు. ఆ రాశులేంటి.. ఎవరిపై ఈ ప్రభావం ఉంది.. తెలుసుకుందాం..

సూర్యుడు ఆత్మగౌరవం, విశ్వాసానికి ప్రతీక. ఇక కేతువు ఆధ్యాత్మిక పురోగతి, దాతృత్వానికి నిదర్శనం. వీరిద్దరి కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. మరికొందరి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీంతో కొన్ని రోజుల పాటు వారు తీసుకునే కీలక నిర్ణయాలు, చేసే పనులపై ప్రభావం పడవచ్చు.
మిథునం
సూర్య కేతు కలయిక.. మిథున రాశి వారికి కష్టాలతో నిండి పోయే అవకాశం ఉంది. వీరు ముఖ్యంగా వృత్తి, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. లేదంటే ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే.. దానికి కొన్ని అడ్డంకులు ఎదురుపడవచ్చు. అందుకే కొంతకాలం ఆగడం మంచిది. పెద్ద నిర్ణయాలు తీసుకునేముందు తొందరపడటం మంచిది కాదు. చిన్న చిన్న విషయాలపై వాదోపదాలు పనికిరాదు. ఒడుదొడుకుల కారణంగా ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా భావిస్తారు.

కన్యా రాశి
సూర్య కేతు గోచారం.. కన్యా రాశి వారికి కొన్ని లాభాలను, కొన్ని సమస్యలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అనవసరమైన ఖర్చులు మీ జేబును ఖాళీ చేస్తాయి. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. లేదంటే అవి ముదిరి మిమ్మల్ని వివాదంలోకి నెట్టేస్తాయి. మీరు తలపెట్టిన కీలకమైన పెద్ద పనులు మధ్యలోనే ఆగిపోయే సూచనలు ఉండటంతో మీలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆర్థికపరమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేస్తున్న పనిపై దృష్టి సారించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం అస్సలు పనికిరాదు. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవద్దు.
మీన రాశి
సూర్య- కేతు గోచారం సమయంలో మీన రాశి వారు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబీకులతో మీరు చేసే ప్రతి పనినీ పంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మనస్పర్థలు రాకుండా ఉంటాయి. మీ మధ్య సమన్వయం ముఖ్యం. వ్యాపార రంగంలో ఉన్నవారు సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆరోగ్యంతో పాటు వ్యాపారానికి సంబంధించిన కీలక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలపై అప్రమత్తంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించడం ద్వారా మీ మ్యారేజ్ లైఫ్‌ను సంతోషంగా ఆస్వాదించండి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఈ కీలక రోజులను బ్యాలెన్స్ చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
