ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్‌లో ఇలాంటి సీన్‌ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్‌ వీడియో.!

మెట్రో లేదా బస్సు వీటి పేరు చెప్పగానే ముందుకు మనకు కొన్ని వైరల్‌ సంఘటనలు గుర్తొస్తాయి. బస్సుల్లో హెవీ రష్‌, సీట్ల కోసం ఆడవారు కొట్టుకోవడం, దుర్బాషలాడుకోవడం, తోసుకోవడం లాంటివి తలచుకుంటే విపరీతంగా నవ్వు తెపిస్తాయి. ఇక మెట్రో రైళ్లలో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు, లవర్స్‌ హద్దు దాటి చేసే పనులు.. ఇలా ఒకటేమిటి లెక్కేస్తే చాలానే ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు చెప్పే ఒక విషయం వీటన్నిటికీ బాప్‌ లాంటిది. ఇంటర్నెట్‌లో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

Passenger hangs wet jacket and track pants in metro train viral video

మెట్రోలో డ్యాన్సులు చేయడం, ప్రాంక్స్‌ చేయడం, మేకప్‌ వేసుకోవడం, విచిత్రమైన బుక్స్‌ చదవడం ఇలా పలు రకాల వింత ఘటనలు చూశాం. కానీ ఇది మాత్రం అందుకు భిన్నం. ఒక ప్రయాణికుడు ఏకంగా మెట్రో కోచ్‌లో బట్టలు ఆరబెట్టాడు. ఈ సంఘటన రైలులో ఉన్న వారు నివ్వెరపోయేలా చేసింది. దీనిని కొందరు వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఢిల్లీ మెట్రోలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

మెట్రో రైలు నడుస్తూ ఉండగా.. కోచ్‌లో ప్రయాణికులు ఎవరి ప్రపంచంలో వారు ఉన్నవారు. కొందరు మొబైల్‌ ఫోన్లు చూస్తుండగా, మరికొందరు పాటలు వింటున్నారు. ఇంకొందరు పక్కవాళ్లతో ముచ్చట్లు లేదా సీట్లలో సైలెంట్‌గా కూర్చోవడం. వీరందరినీ బట్టలు ఆరేసిన ఘటన ఒక్కసారిగా ఆకర్షించింది.

వీడియోను పరిశీలించినట్లయితే ఒక ప్రయాణికుడు వర్షంలో తడిచిపోయిన జాకెట్‌ను మెట్రో కోచ్‌లోని గ్రిల్‌, హ్యాండ్‌ రైల్‌పై వేలాడదీశాడు. దీంతో ఆ సీన్‌ ఒక్కసారిగా ఇంట్లోని బాల్కనీని గుర్తు చేసింది. ఇంటికి వెళ్లాక టైం లేదనుకున్నాడో.. తడిచిన జాకెట్‌తో ఎలా అని ఇబ్బంది పడ్డాడో.. మెట్రో కోచ్‌లోని వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగా ఆరిపోతాయనే ఉద్దేశంతో ఆ ప్రయాణికుడు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో ఇలా బట్టలు ఆరవేయడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి రిస్క్‌ తప్పదంటూ కొందరు కామెంట్‌ చేయగా.. మెట్రో కోచ్‌ ఫుల్‌గా ఉంటే ఇతర ప్రయాణికులకు ఇది ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, August 10, 2026, 19:23 [IST]
Desktop Bottom Promotion