Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
వర్షాకాలంలో అధికంగా చుండ్రు.. తగ్గించే చిట్కాలు..

1. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినూనెలో నిమ్మ రసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా జాగ్రత్తపడాలి. అరగంటపాటు అలేగే ఉంచిన ఆరిన తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది.
2. వారంలో కనీసం రెండు సార్లయినా తలస్నానం చేయడం తప్పనిసరి. అవి కెమికల్స్ నిండిన షాంపూలకన్నా కుంకుడుకాయ, శీకాయ వంటివైతే బెటర్.
3. కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టించి, గంట తర్వాత తలారా స్నానం చేయాలి. రాతప్రూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
4. గసగసాలను మెత్తని ముద్దలా చేసుకుని తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండి తలకు పట్టించి, ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.
5. కొబ్బరినూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించాలి. అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మందార ఆకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి.
6. ఒక కప్పులో కోడిగుడ్డు సొనవేసి దీనిలో ఒకటికి రెండు టేబుల్ స్పూన్‌లు షాంపూ వేసి కలిపి దీనితో తలస్నానం చెయ్యాలి.
7. తలస్నానం చేసే ముందు కురులకు పెరుగు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
8. జుట్టుకు హెర్బల్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రును నివారించవచ్చు. హెడ్ మసాజ్ వల్ల ఉపయోగాలేంటో చూద్దాం. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల అలసిన కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళ మంటలు, తలనొప్పి తగ్గుతుంది. మసాజ్ మూలంగా రక్తపస్రరణ బాగా జరిగి, స్వేదరంధ్రాలు తెరచుకుని వెంట్రుకలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అంతేగాకుండా మాడుకు చలువ చేస్తుంది.
9 . వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అయితే, ఈ హెడ్ మసాజ్‌ను ఎవరు పడితే వారు చేసుకోవడం కంటే, నిపుణులతో చేయించుకుంటేనే మెదడుకు, కళ్ళకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది.
10. ఎవరి దువ్వెనలు వారే వాడుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. అలాగే, టవల్ విడిగా ఉంచుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలతో చుండ్రు దూరమవుతుంది. అందమైన కేశ సౌందర్యం మీ సొంతమౌతుంది.



Click it and Unblock the Notifications
