Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి. అయితే ఇంతటి బలవర్ధకమైన అరటిపండును ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినేస్తున్నారా?
అరటిపండును తప్పుడు సమయంలో తింటే ప్రయోజనాలకు బదులు అనర్థాలు తప్పవని ప్రముఖ ఆరోగ్య నిపుణులు డాక్టర్ సలీం జైదీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియోలో తెలిపారు. అరటిపండులోని పూర్తి పోషకాలను శరీరం గ్రహించాలంటే దానిని తినే కరెక్ట్ టైం తెలుసుకోవడం ముఖ్యం.

అరటిపండు తినడానికి బెస్ట్ టైం ఏది?
చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు అరటిపండు తింటుంటారు. కానీ ఇది అస్సలు సరైన పద్ధతి కాదు. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం, పొటాషియం లెవల్స్ అకస్మాత్తుగా పెరిగిపోయి గుండె, జీర్ణవ్యవస్థపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి, వెంటనే పడిపోవడం వల్ల త్వరగా నీరసం వస్తుంది.
ఇక రాత్రి పూట మన శరీర జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఆ సమయంలో అరటిపండు తింటే జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుని కడుపులో అసౌకర్యం కలుగుతుంది. జలుబు, దగ్గు సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.
కాబట్టి అరటిపండు తినడానికి అత్యుత్తమమైన సమయం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఒకటి లేదా రెండు గంటల వ్యవధిలో తినడం.
బ్రేక్ ఫాస్ట్ తర్వాత అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోజంతా అంతులేని శక్తి
అరటిపండ్లలో సహజ చక్కెరలతో పాటు కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత అరటిపండు తినడం వల్ల ఈ పోషకాలు శరీరంలోకి నెమ్మదిగా విడుదలై, మధ్యాహ్న భోజన సమయం వరకు మీకు ఎలాంటి అలసట, నీరసం రాకుండా చూసుకుంటాయి. రోజంతా ఉల్లాసంగా, యాక్టివ్‌గా ఉండటానికి ఇది ఇంధనంలా పనిచేస్తుంది.
జీర్ణవ్యవస్థకు మేలు,మలబద్ధకానికి చెక్
అరటిపండ్లలో కరిగే, కరగని పీచుపదార్థాలు మెండుగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తీసుకోవడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, మలబద్ధకం వంటి పొట్ట సమస్యల నుండి ఇది చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మాయం
ఖాళీ కడుపుతో అరటిపండు తింటే కొంతమందిలో కడుపులో మంట వస్తుంది. కానీ మీరు బ్రేక్ ఫాస్ట్ తర్వాత తిన్నప్పుడు దాని ప్రభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అరటిపండులో ఉండే సహజ యాంటాసిడ్ గుణాలు, పొటాషియం కడుపులోని ఆమ్లాలను తటస్థీకరిస్తాయి. దీనివల్ల ఎసిడిటీ, ఉబ్బరం వంటివి దరిచేరవు.
రక్తపోటు నియంత్రణ
అరటిపండు పొటాషియంకు కేరాఫ్ అడ్రస్. ఇందులో సోడియం శాతం దాదాపు శూన్యం. ఈ అద్భుతమైన కలయిక అధిక రక్తపోటుని నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అల్పాహారం తర్వాత క్రమం తప్పకుండా అరటిపండును మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గి, రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. తద్వారా గుండె పదిలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
