Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్‌కి ఒక్కో ఎక్స్‌పీరియన్స్
వీకెండ్ వచ్చిందంటే చాలు పర్యాటకప్రియులు తప్పనిసరిగా కొత్త ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ వేస్తుంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే సుందరమైన జలపాతాల వీక్షణకి క్యూ కడతారు. ఈ క్రమంలో హైదరాబాద్ నలువైపులా ఉన్న ఈ వాటర్‌ఫాల్స్, ట్రెక్కింగ్ ప్రదేశాలను ఒక్కో వీకెండ్ ప్లాన్ చేసుకోండి.. మీ వీకెండ్ విహారయాత్ర ఫరెవర్ మెమరబుల్‌గా ఉంటుంది.

అనంతగిరి హిల్స్
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ హైదరాబాద్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మూసీ నది ఉద్భవించే అద్భుతమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన అనంతగిరి హిల్స్.. నగరవాసులకు మంచి వీకెండ్ ట్రిప్..
అనంతగిరి హిల్స్ సమీపంలో పురాతనమైన పద్మనాభ స్వామి ఆలయం గుహ రూపంలో కొలువై ఉంది. మూసీ నది ఈ కొండల్లోనే ఉద్భవించింది. ఇక్కడి కోటపల్లి రిజర్వాయర్ వద్ద బోటింగ్‌కి బెస్ట్ స్పాట్.. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది సూపర్ లొకేషన్.. జులై నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో, అక్టోబర్ నుంచి మార్చి వరకు శీతాకాలంలో ఇక్కడకు వెళ్లినట్లయితే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో ఉన్న అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ మల్లెల తీర్థం. ఈ జలపాతం సుమారు 150 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతుంది. హైదరాబాద్ నుంచి సుమారు 180 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం నుంచి దాదాపు 58 కి.మీ ప్రయాణిస్తే మల్లెల తీర్థం చేరుకోవచ్చు. అయితే ఈ జలపాతాన్ని చేరుకోవడానికి 300 నుంచి 350 మెట్లు దిగాల్సి ఉంటుంది. ఉదయం 8 గం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. ఇక్కడి నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు. ఈ నీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యకరంగా భావిస్తారు. ఇక్కడ హోటళ్లు, ఆహార వసతులు లేని కారణంగా వాటిని వెంట తీసుకెళ్లడం మంచిది.
బొగత వాటర్‌ఫాల్స్
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన, ప్రకృతి పర్యాటక ప్రాంతాల్లో బొగత వాటర్ ఫాల్స్ ఒకటి. దట్టమైన అడవులు, కొండకోనల మధ్య సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారుతుంది. "తెలంగాణ నయాగరా"గా బొగత వాటర్ ఫాల్స్ పిలుస్తారు. ములుగు జిల్లాలో ఉన్న ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 327 కి.మీ ఉంటుంది. వరంగల్ నుంచి సుమారు 140 కి.మీ, ములుగు నుంచి 90 కి.మీ, భద్రాచలం నుంచి 120 కి.మీ ఉంటుంది. స్థానికంగా చీకులపల్లి జలపాతంగా పిలుస్తారు. వర్షాకాలంలో టూరిస్ట్, ట్రెక్కింగ్ ప్రియులకు బొగత వాటర్ ఫాల్స్ బెస్ట్ ఛాయిస్. ఇక్కడికి వెళ్లాలనుకునేవారు ముందుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు తెలుసుకుని వెళ్లడం మంచిది.

పోచారం వన్యప్రాణుల అభయారణ్యం
రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం వన్యప్రాణుల అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ ప్రముఖ పర్యాటక కేంద్రం ప్రకృతి ప్రేమికులకు, బర్డ్ లవర్స్, వీకెండ్ ట్రిప్స్‌కి మంచి టూరిస్ట్ స్పాట్. ఈ అభయారణ్యం సుమారు 130 చదరపు కి.మీ మేర దట్టమైన అడవులతో విస్తరించి ఉంది. కృష్ణ జింకలు, చుక్కల జింకలు గుంపులుగా విహరిస్తాయి. అనేక రకాల వన్యప్రాణులను ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 115 కి.మీ ఉంటుంది.
ఎత్తిపోతల వాటర్ ఫాల్స్
ఎత్తిపోతల వాటర్‌ఫాల్స్ ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ఉంది. నాగార్జునసాగర్ నుంచి సుమారు 15-20 కి.మీ దూరంలో ఉంది. వర్షాకాలంలో సాగర్ వెళ్లాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. చంద్రవంక నదిపై 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే సుందరమైన జలపాతం ఇది. జలపాతం దిగువన అందమైన కొలను పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటుంది.



Click it and Unblock the Notifications
