Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు!
మనలో చాలామందికి తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, పుల్లటి తేన్పులు రావడం లేదా కడుపులో విపరీతమైన గ్యాస్ ఫామ్ అవ్వడం లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీనికోసం తరచూ సిరప్‌లు, గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వాడేస్తుంటాం.
కానీ అసలు సమస్య మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల్లోనే ఉందనే విషయం మీకు తెలుసా? మనం రోజూ పాటిస్తున్న 5 అలవాట్లను గనుక మానుకుంటే, గ్యాస్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఏ 5 అలవాట్లు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదో ఇక్కడ చూడండి.

తినేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగొద్దు
చాలామందికి తింటున్నప్పుడు మధ్యమధ్యలో గ్లాసుల కొద్దీ నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఆహారం తినేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు విలీనమై పలచబడతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కడుపులోనే ఉండిపోయి, గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి తినేటప్పుడు నీళ్లను తగ్గించి, తిన్న అర గంట తర్వాత తాగడం మంచిది.
ఫుడ్ ని వేగంగా మింగొద్దు
ఉరుకుల పరుగుల జీవితంలో భోజనాన్ని త్వరత్వరగా పూర్తి చేయడం మరొక పెద్ద తప్పు. ఫాస్ట్ గా తింటే ఫుడ్ తో పాటు ఎయిర్ కూడా లోపలికి వెళ్తుంది. అంతేకాకుండా నమలకుండా మింగేసిన ఆహారాన్ని జీర్ణం చేయడం కడుపుకు చాలా కష్టమవుతుంది. అదే తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ కి కారణమవుతుంది. అందుకే ఆహారాన్ని ప్రశాంతంగా, బాగా నమిలి తినాలి.
తిన్న వెంటనే పడుకోకండి
తిన్న వెంటనే మంచం ఎక్కడం లేదా సోఫాలో వాలిపోవడం అసిడిటీ, గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణం. మనం పడుకున్నప్పుడు జీర్ణాశయంలోని ఆమ్లాలు, ఆహారం పైకి అనగా అన్నవాహిక వైపు నెట్టబడతాయి. దీనివల్ల గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. భోజనం చేసిన తర్వాత కనీసం 20-30 నిమిషాలు నడవండి.
కూల్ డ్రింక్స్, సోడా తగ్గించండి
దాహంగా ఉందనో లేదా తిన్నది త్వరగా అరుగుతుందనో కొందరు కూల్ డ్రింక్స్, సోడాలు తాగుతుంటారు. కానీ ఇది పూర్తి అపోహ మాత్రమే. కార్బోనేటెడ్ పానీయాల్లో ఉన్న గ్యాస్ నేరుగా మీ పొట్టలోకి చేరుతుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి బదులు, తక్షణమే మరింత పెంచుతుంది.
రాత్రి ఆలస్యంగా హెవీ మీల్స్ తినొద్దు
అర్ధరాత్రి వేళల్లో బిర్యానీలు, నూనె పదార్థాలు తినడం జీర్ణవ్యవస్థకు నరకం చూపిస్తుంది. రాత్రి సమయంలో మన జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో బరువైన ఆహారం తింటే, అది ఉదయం వరకు కడుపులోనే ఉండిపోయి పులిసిపోతుంది. లేట్ నైట్ బిర్యానీ, ఆయిలీ ఫుడ్ ఉదయం వరకు కడుపులో ఫెర్మెంటేషన్ జరిగి గ్యాస్ తయారవుతుంది. కాబట్టి రాత్రి పూట తేలికపాటి ఆహారాన్ని, సాధ్యమైనంత త్వరగా తినేలా చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
