Latest Updates
-
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట!
మహిళల్లో జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం...!

జుట్టు రాలడానికి అరికట్టేందుకు కొన్ని సూచనలు:
1. సాధారణంగా కొంత మంది తలకు నూనె అనేది వాడరు. అందువల్ల కేశాలు పొడిబారి పోవడం, తడిలేకుండా నిర్జీవంగా మారి కురులు తెగిపోవడం లేదా, రాలిపోవడం జరుగుతుంటాయి. అందుకోసం నెలలో రెండు సార్లైనా తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. అందులో బాదం నూనె లేదా ఆలివ్ నూనె లేదా శుద్దమైన కొబ్బరి నూనె ఏదో ఒకటి తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ లో మీ జుట్టుకు సరిపడా తీసుకొని అందులో కొన్ని మెంతులు కలిపి తక్కువ మంట మీద వేడి చేసి, రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చగా తలకు మునివేళ్ళతో పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కేశాలు రాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరుగుతాయి.
2. కేశాలు రాలడానికి మరో ముఖ్యమైన కారణం ఆహారం. ముఖ్యంగా ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. దాంతో జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఎండబెట్టిన అత్తిపండు, జీడిపప్పు, బాదాం, లివర్ మరియు రొయ్యలు వంటివి తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ శరీరాని అంది, జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
3. ముఖ్యంగా తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దుమ్ము, ధూళి, చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వంటి వాటితో జుట్టు బలహీనపడి జుట్టు రాలడానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ తలను శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారానికి రెండు సార్లైనా మంచి కండీషనర్ తో తలస్నానం చేయడం మంచిది.
4. ప్రతి రోజూ మీరు ఉపయోగించే హెయిర్ క్లిప్స్ లేదా హెయిర్ బ్యాండ్స్ చాలా బిగుతుగా వుండేవి వాడకూడదు. జుట్టును ఇలాంటి కఠినమైనటువంటి క్లిప్స్, హెయిర్ బ్యాండ్ తో గట్టిగా బంధిచడం లేదా ముడి వేయడం వల్ల జుట్టును బలహీన పరచి కురును నాశనం చేస్తాయి.
5. ముఖ్యంగా తలకు ఉపయోగించే షాంపూ తేమ స్వభావాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. జిడ్డుగా ఉన్న కురుల కోసం తప్పనిసరిగా ఇలాంటి షాంపూలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
6. కేశాలకు హెయిర్ జెల్ లేదా హెయిర్ స్ప్రేలను ఉపయోగించడం వల్ల కురులు తెగిపోవడం జరుగుతుంది. ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. హెయిర్ జెల్, హెయిర్ స్ప్రేలను వాడినప్పుడు వెంటవెంటనే తలస్నానం చేయాల్సి ఉంటుంది.
7. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం కొబ్బరి నీళ్ళు తాగడమే. తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు బాగా సహాయ పడుతుంది.
8. ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు శరీరానికి కానీ, తలకు కానీ ఎండ వేడిమి, సూర్య రశ్మి డైరెక్ట్ గా తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. సూర్య రశ్మి సూటిగా శరీరానికి తగలడం వల్ల ఆరోగ్యానికి సంబందించిన తీవ్రమైన పరిణామాలకు కారణం కావచ్చు.
ఈ అద్బుతమైన చిట్కాలను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి తప్పకుండా సహకరిస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఆ మార్పు మీకే తెలుస్తుంది.



Click it and Unblock the Notifications
