Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
డాండ్రఫ్(చుండ్రు)కు చక్కటి ఇంటి చిట్కాలు...

1. అర మగ్గు నీళ్ళల్లో రెండు టీస్పూన్ వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక వెనిగర్ నీళ్ళను తలకు బాగా పట్టించాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు నెలలపాటు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
2. వారానికి రెండుసార్లు గోరువెచ్చటి కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి. చేతి వేళ్ళతో అరగంట సున్నితంగా రాయాలి. వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట వుంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ చేకూరుతుంది.
3. చుండ్రు ఎక్కువుగా వున్నప్పుడు మెంతులు నానబెట్టి ఫేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చెయాలి.
4. ఎక్కువ ఆకుకూరలు, పీచుపదార్థం, విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు తినాలి. కాయగూరలు, చేపలను సమతూలంగా ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తినకపోవడం మంచిది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భుజించాలి.
5. తలను ఎప్పుడు కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరుచుగా తలకు షాంపూ పెట్టి, సరైనా కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు తలను శ్రద్ధగా శుభ్రపరచాలి. మాయిశ్చరైజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ ను వాడితే చర్మం పొడిగా అవదు.
6. తలస్నానం చేయడానికి అరగంట ముందుగానే. పుల్లగా వుండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.
7. ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. నిమ్మరసంలో ఉసిరికాయ రసంకానీ, ఉసిరి పొడి కానీ కలిసి తలకు మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.
8. నాలుగు టీస్పూన్ల అల్లం రసంలో మూడు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ రసం కలిపి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications