Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
కేవలం 30రోజుల్లో 2 ఇంచుల జుట్టు పెరిగేలా చేసే అమేజింగ్ ప్యాక్..!
జుట్టుకి కావాల్సిన పోషకాలను ఈ మాస్క్ అందిస్తుంది. అవకాడో, తేనె, గుడ్డులోని పచ్చసొన, బీర్ ఉపయోగించి ఈ మాస్క్ తయారు చేసుకోవాలి.
జుట్టు రాలిపోతోందన్న విషయం ప్రతిరోజూ గమనించి.. తీవ్ర ఇబ్బందిపడుతున్నారా ? ఇలాగే జుట్టు రాలిపోతే.. చివరికి బట్టతల వచ్చేస్తుందని భావిస్తున్నారా ? రోజుకి వంద కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతున్నాయా ? అయితే మీ జుట్టు సంరక్షణపై ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇంట్లోనే, ఇంట్లోని వస్తువులతోనే ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది డ్యామేజ్ అయిన వెంట్రుకలను రిపేర్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది. కొత్త జుట్టు కణాలు ఏర్పడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టుకి షైనింగ్ ని అందిస్తుంది.
జుట్టుకి కావాల్సిన పోషకాలను ఈ మాస్క్ అందిస్తుంది. అవకాడో, తేనె, గుడ్డులోని పచ్చసొన, బీర్ ఉపయోగించి ఈ మాస్క్ తయారు చేసుకోవాలి. అవకాడోలో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్కాల్ప్ హెల్త్ కి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. తేనె జుట్టు మాయిశ్చరైజర్ కోల్పోకుండా అడ్డుకుంటుంది.
గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ని మెరుగుపరిచి, ఎలాస్టిన్ ని మెరుగుపరుస్తుంది. బీర్ లో ఉండే మినరల్స్ జుట్టుని స్ట్రాంగ్ గా, షైనీగా, ఒత్తుగా మారుస్తాయి. మరి నెలలోనే 2 ఇంచుల పొడవు జుట్టు పెరగడానికి సహాయపడే ఈ అమేజింగ్ హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేయాలో చూద్దాం..

స్టెప్ 1
అవకాడో అందుబాటులో లేనివాళ్లు, అవకాడో కొనలేని వాళ్లు అరటిపండు తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒక ఫ్రూట్ తీసుకుని మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

స్టెప్ 2
మరొక గిన్నె తీసుకుని గుడ్డులోని తెల్లసొన పక్కకు తీయాలి. ఫోర్క్ ఉపయోగించి.. బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్ట్ లో అవకాడో లేదా అరటిపండు పేస్ట్ లో కలపాలి.

స్టెప్ 3
తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె, అర కప్పు బీర్ తీసుకోవాలి. రెండింటినీ బాగా కలపాలి. మెత్తటి పేస్ట్ అయ్యేంతవరకు కలపాలి.

స్టెప్ 4
ఇప్పుడు జుట్టుని వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వుకోవాలి. చిక్కులు లేకుండా జుట్టు మొత్తాన్ని నీట్ గా దువ్వుకోవాలి.

స్టెప్ 5
జుట్టుని 4 నుంచి 5 సన్నని భాగాలుగా విడదీయాలి. ఇప్పుడు బ్రష్ ఉపయోగించి.. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి. జుట్టు మొత్తానికి, కుదుళ్లు, స్కాల్ప్ అంతటికీ.. బాగా ఈ ప్యాక్ అప్లై చేయాలి.

స్టెప్ 6
జుట్టుని పైకి కట్టుకోవాలి. గంట సేపు ఈ ప్యాక్ తలలోనే ఉంటే.. జుట్టుకి పోషకాలు బాగా అందుతాయి.

స్టెప్ 7
తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి.. జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు వారానికి రెండుసార్లు ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేస్తే.. మీ జుట్టు 2 ఇంచులు ఖచ్చితంగా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
