Latest Updates
-
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా? -
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా?
భారతదేశ రక్షణ వ్యవస్థ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది త్రివిధ దళాలు. అవే మన ఆర్మీ, నేవీ,ఎయిర్ ఫోర్స్. ఈ దళాలకు చెందిన అధికారులు లేదా జవాన్లు ఎప్పుడైనా ఒకచోట చేరి సెల్యూట్ చేస్తున్నప్పుడు, వారి చేతుల భంగిమలు అచ్చం ఒకేలా ఉండవని మీరు ఎప్పుడైనా గమనించారా?
పైకి చూడటానికి అన్నీ సెల్యూట్లే అనిపించినా, వాటి వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, దాగి ఉన్న అంతరార్థాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతి దళానికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన సెల్యూట్ విధానం ఉంది.

ఇండియన్ ఆర్మీ- అరచేయి ముందుకు కనిపించేలా
భారత సైనికులు తమ అరచేయి పూర్తిగా ఎదురుగా ఉన్నవారికి స్పష్టంగా కనిపించేలా సెల్యూట్ చేస్తారు. ఇలా అరచేయి బహిరంగంగా చూపించడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. నా చేతిలో ఎలాంటి ఆయుధం లేదు, నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను, గౌరవిస్తున్నాను అని చెప్పడమే ఈ సెల్యూట్ ముఖ్య ఉద్దేశం. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే మన ధీర సైనికులు, తమ పై అధికారులకు, తోటి వారికి మాత్రం ఈ విధానం ద్వారా తమ నిఖార్సయిన విధేయతను ఎంతో హుందాగా తెలియజేస్తారు.
ఇండియన్ నేవీ- అరచేయి కిందికి ఉండేలా
ఇండియన్ నేవీ సిబ్బంది సెల్యూట్ చేసేటప్పుడు వారి అరచేయి భూమి వైపు (కిందికి) చూసేలా ఉంటుంది. దీని వెనుక ఎంతో ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. పాత రోజుల్లో ఓడల్లో పనిచేసే నావికుల చేతులు ఎప్పుడూ గ్రీజు, యంత్రాల నూనెలు,మురికితో నిండి ఉండేవి. తమ ఉన్నతాధికారులకు సెల్యూట్ చేసే సమయంలో ఆ మురికి చేతులను చూపించడం అగౌరవంగా భావించేవారు. అందుకే తమ అరచేతిలోని మురికి కనిపించకుండా చేతిని కిందికి వంచి గౌరవవందనం చేయడం ప్రారంభించారు. నాటి నావికుల ఆచరణాత్మక పద్ధతే నేటికీ ఒక అందమైన అధికారిక సంప్రదాయంగా నావికాదళంలో కొనసాగుతోంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ - అరచేయి 45 డిగ్రీల కోణంలో
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ మిగతా రెండు దళాలకూ భిన్నంగా ఉంటుంది. వీరు తమ అరచేతిని సుమారు 45 డిగ్రీల కోణంలో వంచి వందనం చేస్తారు. మీకు తెలుసా? 2006 మార్చి కంటే ముందు మన వైమానిక దళం కూడా ఆర్మీ లాగానే సెల్యూట్ చేసేది. కానీ ఆకాశంలోకి దూసుకెళ్లే విమానాలను ప్రతిబింబించేలా, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కొత్త సెల్యూట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఈ భంగిమ శారీరకంగా మరింత సహజంగా, సౌకర్యవంతంగా ఉంటుందని భావించి వాయుసేన దీనిని ప్రామాణీకరించింది.



Click it and Unblock the Notifications
