For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆవనూనెను జుట్టుకి అప్లై చేస్తే కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!

ఆవనూనెలో కూడా.. జుట్టుకి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివాసన, మందంగా ఉండటం వల్ల.. చాలామంది ఆవనూనెను జుట్టుకి ఉపయోగించరు. కానీ.. షాంపూ చేసుకున్న తర్వాత.. స్మెల్ పోతుంది.

By Swathi
|

ఆవనూనెను.. చాలా మంది వంటకాల్లో ఉపయోగిస్తారు. కానీ.. దీన్ని జుట్టుకి కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా ? నిజమే.. ఆవనూనె జుట్టుకి ఉపయోగిస్తే.. అద్భుత ఫలితాలు పొందవచ్చు.

mustard oil

ఆవనూనెను ఆవాల ద్వారా తీస్తారు. ఇది చూడ్డానికి ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇందులో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉంటాయని.. నిపుణులు సూచిస్తారు. ఆవనూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. దీన్ని వంటకాల్లో ఉపయోగించడానికి సరైనది.

ఆవనూనెలో కూడా.. జుట్టుకి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివాసన, మందంగా ఉండటం వల్ల.. చాలామంది ఆవనూనెను జుట్టుకి ఉపయోగించరు. కానీ.. షాంపూ చేసుకున్న తర్వాత.. స్మెల్ పోతుంది. కాబట్టి.. ఆవనూనెను జుట్టుకి ఉపయోగించవచ్చు.

అన్ని రకాల జుట్టు సమస్యలు నివారించడంలో.. ఆవనూనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి ఆవనూనెను ఎలా ఉపయోగించాలి ? ఎలాంటి ఫలితాలు పొందవచ్చో చూద్దామా.. ??

తెల్లజుట్టు

తెల్లజుట్టు

ఆవనూనెను ఉపయోగించడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా.. అడ్డుకోవచ్చు. ఇది.. న్యాచురల్ గా జుట్టుని డార్క్ గా మారుస్తుంది. కాబట్టి.. ఆవనూనెను మీరు 20లలో ఉన్నప్పుడు ఉపయోగిస్తే.. జుట్టు తెల్లబడటాన్ని అడ్డుకోవచ్చు.

మసాజ్

మసాజ్

స్కాల్ప్ ని మసాజ్ చేయడానికి ఆవనూనె చాలా మంచిది. ఆవనూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా సాగుతుంది. జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేసి.. జుట్టు షైనీగా మారడానికి సహాయపడుతుంది.

డ్రై హెయిర్

డ్రై హెయిర్

మీకు డ్రై హెయిర్ ఉంటే.. ఆవనూనెను ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇది జుట్టుకి మాయిశ్చరైజ్ ని అందిస్తుంది. ఇది జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది.

చుండ్రు

చుండ్రు

చుండ్రు నివారించడంలో.. ఆవనూనె చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. చాలా ఏళ్లుగా ఇండియన్స్.. చుండ్రు నివారించడానికి, స్కాల్ప్ హెల్తీగా ఉండటానికి.. ఆవనూనె ఉపయోగిస్తున్నారు.

జుట్టు పెరుగుదల

జుట్టు పెరుగుదల

ఆవనూనెతో.. వారానికి ఒకసారి.. బాగా మసాజ్ చేస్తే.. జుట్టు ఒకనెలలోపే వేగంగా పెరుగుతుంది. ఆవనూనెతో మసాజ్ చేసిన తర్వాత షవర్ క్యాప్ పెట్టుకుని రాత్రంతా అలానే వదిలేయాలి. అంతే.

చివర్లు చిట్లిపోవడం

చివర్లు చిట్లిపోవడం

జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గించడంలో.. ఆవనూనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చిట్టిపోవడాన్ని అరికట్టడమే కాకుండా.. జుట్టుని స్ట్రాంగ్ గా మారుస్తుంది.

ఒత్తైన జుట్టుకి

ఒత్తైన జుట్టుకి

జుట్టుకి ఆవనూనెను వారానికి మూడుసార్లు బాగా పట్టించి.. తర్వాత జుట్టుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా జుట్టుకి ఆవనూనె పట్టించడం వల్ల.. జుట్టు ఒత్తుగా మారుతుంది.

English summary

Can You Use Mustard Oil For Hair? Find Out How!

Can You Use Mustard Oil For Hair? Find Out How! Mustard oil, or sarso ka tel, can be found in most Indian kitchens, as it used for cooking in a lot of households.
Story first published: Saturday, October 15, 2016, 11:38 [IST]
Desktop Bottom Promotion