Latest Updates
-
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.!
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.!
వేసవి వచ్చిందంటే మామిడికాయ పప్పుని ఎంతగా ఇష్టపడతారో చింతచిగురు పప్పుని అంతకంటే ఎక్కువే లైక్ చేస్తారు. కేవలం సమ్మర్లో మాత్రమే దొరికే చింతచిగురుతో పుల్లపుల్లగా పచ్చడి, పప్పు చేసుకుంటే ఇక వేరే కర్రీ జోలికే వెళ్లరు. ఇక రాయలసీమలో ముఖ్యంగా అనంతపురంలో చింతాకు పప్పు చాలా స్పెషల్. ఆ స్టైల్లో కమ్మనైన చింతచిగురు పప్పు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

చింతాకు పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు
చింత చిగురు- ఒక కప్పు
కందిపప్పు- అర కప్పు
ఉల్లిపాయ- ఒకటి
వెల్లుల్లి- రెండు గడ్డలు
వంకాయలు- రెండు
కారం- ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు- టీ స్పూన్
ఎండు మిర్చి- రెండు
కరివేపాకు- కొద్దిగా
మెంతి ఆకులు- గుప్పెడు
నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్
చింతాకు పప్పు తయారీ విధానం
ముందుగా పప్పును రెండు సార్లు కడిగిపెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో స్పూన్ నూనె వేసి కడిగిన పప్పును వేసి కాసేపు వేయించాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ, వంకాయ ముక్కలు, పసుపు వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. నీళ్లు ఇంకిన తర్వాత మరికొన్ని నీళ్లు పోసి కడిగి పెట్టుకున్న చింతచిగురు, మెంతి ఆకులు, కచ్చాపచ్చాగా దంచిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి ఒకసారి కలిపి మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.
విజిల్ ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి సరిపడా ఉప్పు వేసి కలిపి ఒకసారి పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాన్‌లో మిగిలి నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగాక తాలింపు పెట్టుకోవాలి. అనంతపురం స్టైల్ చింతాకు పప్పు రెడీ. వేడి అన్నం లేదా రోటీలోకి అప్పడాలతో పాటు ఈ చింతచిగురు పప్పును వడ్డించుకుని తింటే ఆ రుచి మళ్లీ వేసవి వరకు మరిచిపోలేరు.
చింతచిగురు పప్పుతో ఒంట్లోని కొవ్వు కరిగిపోవాల్సిందే..
చింతచిగురు పప్పు తినడం ద్వారా ప్రొటీన్లు(5.8 గ్రాములు), ఐరన్(3.4 మి.గ్రా), పీచుపదార్థం(10.6 గ్రాములు), విటమిన్ 'సి'(3 మి.గ్రా), కాల్షియం(100 గ్రా.) సమృద్ధిగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తహీనత బారి నుంచి కాపాడుతుంది. ఎదిగే పిల్లల్లో ఎముకల దృఢత్వానికి దోహదపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్తో బాధపడుతున్న వారికి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications