Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.!
వేసవిలో చర్మంపై సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా సన్‌ట్యాన్ ఎఫెక్ట్‌తో స్కిన్ త్వరగా నల్లబడటం, కాంతిహీనంగా మారడం జరుగుతుంది. ఇందుకు తగ్గట్లుగానే చర్మ సంరక్షణ కోసం డీ టాన్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎలాంటి చికిత్సలు లేకుండానే వంటింటి చిట్కాలతో ముఖాన్ని, చర్మాన్ని మునుపటిలా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

పప్పు ధాన్యాలతో ముఖానికి ప్యాక్ చేసుకున్నట్లయితే మృత చర్మ కణాలను తొలగించి, సహజంగా కాంతిని పునరుద్ధరిస్తుంది. ఇంకా శరీరానికి పోషణ అందించి చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. మరెలాంటి పప్పు ధాన్యాలతో ఫేస్‌ప్యాక్ చేసుకుంటే ఫలితాలు ఉంటాయో ఇక్కడ చూద్దాం..
కందిపప్పుతో ఫేస్ ప్యాక్
ఎర్ర కందిపప్పు.. గరుకు చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోహదపడుతుంది. 2 టేబుల్ స్పూన్ల పప్పులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు, ఒక టీస్పూన్ తేనె కలిపి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు మంచినీళ్లతో ముఖం కడుక్కుని ఈ పేస్ట్‌ను ఫేస్‌కి అప్లై చేసి ఓ గంటపాటు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం ద్వారా ముఖంపై మృత చర్మ కణాలు తొలగి స్మూత్‌గా మారుతుంది.
శనగపప్పు
రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి గంటసేపు నానబెట్టుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా ఇది అద్భుతమైన డీ- టాన్ చికిత్సగా పనిచేస్తుంది. ఇందులోని సహజ గుణాలు చర్మంపై మురికిని తొలగించి ప్రకాశవంతంగా మారుస్తుంది.
మినప్పప్పుతో కలబంద కాంబో
మీ చర్మం పొడిబారి, చికాకుగా ఉండి నల్లగా మారినట్లయితే మినప్పప్పు, కలబంద మిశ్రమం సంజీవనిలా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పులో టేబుల్ స్పూన్ తాజా కలబంద జెల్‌ను కలపాలి. రెండు గంటల తర్వాత మెత్తని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మ రంధ్రాలను తేమగా ఉంచుతుంది. దెబ్బ తిన్న చర్మాన్ని కాపాడుతుంది.

కందిపప్పులోని సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్ గుణాలు చర్మంపై మలినాలను తొలగిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పులో టేబుల్ స్పూన్ తాజా టమాటా గుజ్జు కలిపి నానబెట్టాలి. గంట తర్వాత మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని సున్నితంగా కడుక్కోవాలి. ముఖంపై సన్ టాన్‌ను తగ్గించి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications