7 రోజుల్లో జుట్టు సమస్యలను నివారించే ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు!!

తరచూ మీ జుట్టు డ్రైగా మారడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుందా..? ఇంకా మీరు రెగ్యులర్ గా ఉపయోగించే షాంపులు మరియు కండీషనర్స్ ఏమాత్రం ఉపయోగపడటం లేదా? అయితే మీ జుట్టుకు ఖచ్చితంగా ప్రోటీన్ సప్లిమెంట్ అవసరం అవుతుంది. శరీరంలో ప్రోటీన్స్ నష్టపోతే ఎన్ని ఆరోగ్య పరంగా ఎన్ని అనర్థాలు జరుగుతాయో. జుట్టులో కూడా సరైన పోషణ అందకపోయినా, ప్రోటీన్స్ లోపించిన జుట్టు అనేక సమస్యలను ఎదుర్కటుంటుంది. అందువల్ల, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా పెరగాలన్నా సరిపడా ప్రోటీన్స్ అందాలే చూసుకోవాలి. అలాగే కొన్ని ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు వేసుకోవడానికి ముందు, ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ల యొక్క ప్రత్యేకతను తెలుసుకోవాలి. ప్రోటీన్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు అందుతాయి.

జుట్టు డ్రైగా..డ్యామేజ్డ్ అయిన జుట్టుకు గుడ్డు, పెరుగు లేదా అరటిపండు వంటివి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. నిర్జీవమైన హెయిర్ ను ఆరోగ్యవంతంగా మార్చితాయి. జుట్టు సాప్ట్ గా ..షైనీగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకా ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు చిక్కుబడకుండా ఉంటుంది. దాంతో జుట్టు చిట్లకుండా ఉంటుంది. ప్రోటీన్ బేస్డ్ హెయిర్ ప్యాక్ ను బయట బ్యూటీ స్టోర్స్ లో కొనుగోలు చేసుకోవచ్చు. దానికి ముందు ఇంట్లో మనకు అందుబాటులో ఉండే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఎందుకు ట్రై చేయ్యకూడదు..? ఇంట్లో ఉండే ప్రోటీన్ ఫుడ్స్ తో హెయిర్ ఫ్యాక్ వేసుకోవడం సౌకర్యవంతంగా ుంటుంది మరియు సులభం కూడా. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ,.

జుట్టు రాలడానికి కారణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటుంది. కొంత మందిలో జుట్టు రాలడానికి చుండ్రు కారణమైతే..మరికొంత మందిలో డ్రై హెయిర్ వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది.
జుట్టు చిట్లకుండా...బ్రేకేజ్ కాకుండా ఉండాలన్నా..జుట్టు రాలడం తగ్గించాలన్నా 7 ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ లను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం...

గుడ్డు మరియు పెరుగు హెయిర్ మాస్క్ :

గుడ్డు మరియు పెరుగు హెయిర్ మాస్క్ :

¼th కప్పు పెరుగులో ఒక గుడ్డులోని వైట్ అండ్ ఎల్లో రెండూ మిక్స్ చేయాలి. అలాగే మొయోనైజ్ ¼th కప్పు జోడించుకోవచ్చు. ఈ మిశ్రమంను బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి తలకు మరియు జుట్టుకు అప్లై చయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మొయోనైజ్ హెయిర్ మాస్క్ :

మొయోనైజ్ హెయిర్ మాస్క్ :

జుట్టుకు తగినంత ప్రోటీన్స్ ను అందివ్వాలంటే మొయోనైజ్ హెయిర్ మాస్క్ బెస్ట్ . ఇది డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ను నివారిస్తుంది. ఇది ఈజీ హోం రెమెడీ. మొదట జుట్టును శుభ్రంగా క్లీన్ చేసి, తర్వాత మొయోనైజ్ ను డైరెక్ట్ గా జుట్టుకు అప్లై చేయాలి. జుట్టుకు కాకుండా ..జుట్టు మొదళ్ళకు ఎక్కువగా అప్లై చేయాలి. మొయోనైజ్ అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మారుతుంది.

అవొకాడో & కోకనట్ మిల్క్ హెయిర్ మాస్క్ :

అవొకాడో & కోకనట్ మిల్క్ హెయిర్ మాస్క్ :

గ్రీన్ ఫ్రూట్ అవొకాడోలో ప్రోటీన్స్ మరియు ఇతర న్యూట్రీషియన్ అధికంగా ఉన్నాయి. కోకనట్ మిల్క్ లేదా కోకనట్ ఆయిల్ జుట్టుకు తగినంత మాయిశ్చరైజర్ ను అంధించి, మాయిశ్చరైజర్ ను బ్యాలెన్స్ చేస్తుంది . అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఫ్రెష్ కోకనట్ మిల్క్ ను జోడించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది అద్బుతమైన ఫలితాలను అందివ్వడంతో పాటు, జుట్టురాలడాన్నిఒక వారంలోపు కంట్రోల్ చేస్తుంది.

అరటి హెయిర్ మాస్క్ :

అరటి హెయిర్ మాస్క్ :

ఇది మరో పబర్ ఫుల్ రెమెడీ. దీన్ని పురాతన కాలం నుండే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంది. బాగా పండిన అరటిపండును గుజ్జులా, లేదా పేస్ట్ లా స్మాష్ చేయాలి. మీ జుట్టు మరీ డ్రైగా ఉంటే అరటిపండు కు కొద్దిగా తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

బాదం ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ :

బాదం ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ :

ఆయిల్ ట్రీట్మెంట్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోటీన్ మాస్క్ . ఈ కాంబినేషన్ ఆయిల్లో విటమిన్ ఇ మరియు డిలు పుష్కలంగా ఉన్నాయి. హెల్తీ హెయిర్ పొందడానికి ఇది చాలా అవసరం. ఈ రెండు ఆయిల్స్ ను మిక్స్ చేసి, నిధానంగా మిక్స్ చేయాలి. ఈ ఆయిల్స్ ను రాత్రిల్లో పెట్టుకుంటే మరింత బెటర్ రిజల్ట్ పొందుతారు.

ఓట్ మీల్ హెయిర్ మాస్క్ :

ఓట్ మీల్ హెయిర్ మాస్క్ :

ఓట్ మీల్ మరియు పాలు సమంగా తీసుకోవాలి. మీ జుట్టు పొడవును బట్టి, క్వాంటిటి మీరు తీసుకోవాలి. ఈ రెండింటి చిక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను తలకు అప్లై చేయడానికి ముందు తలను బాగా దువ్వుకోవాలి. తర్వాత ఈ హెయిర్ మాస్క్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇది హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఆటోమాటిక్ గా జుట్టు రాలడం తగ్గిస్తుంది.

కొబ్బరి నూనెతో మాస్క్ :

కొబ్బరి నూనెతో మాస్క్ :

మరో ఎఫెక్టివ్ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ఇది. అందుకోసం కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని గోరువెచ్చగా చేసి, రాత్రి నిద్రించడానికి ముందు తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత రోజు ఉదయం తలస్నానం చేయాలి. అలాగే ఈ నూనెకు కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ గా పోషణ అందుతుంది. కండీషనర్ గా పనిచేస్తుంది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది .

Story first published: Thursday, September 8, 2016, 14:16 [IST]
Desktop Bottom Promotion