Latest Updates
-
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు
జుట్టు రాలడం తగ్గించి, హెయిర్ వాల్యూమ్ పెంచే ట్రెడిషినల్ రెమెడీస్ ..
నేచురల్ గా ఉండే జుట్టు చూడటానికి అదనపు అందాన్ని, అదనపు సైనింగ్ ను అందిస్తుంది. అంతే కాదు, సహజంగా ఉండే జుట్టు ఎప్పుడూ సహజ అందాన్ని అందిస్తుంది.
కానీ ప్రస్తుత రోజుల్లో అలాంటి నేచురల్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ పొందాలంటే చాలా కష్టం. ముఖ్యంగా రోజూ వాతావరణ కాలుష్యం, పోషకాహారలోపం, హానికరాక బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల ఆరోగ్యకర, అందమైన జుట్టును పొందలేకపోతున్నారు.
కాబట్టి, జుట్టుకు హానికలిగించే కెమికల్ ప్రొడక్ట్స్ ను సాధ్యమైనంత వరకూ నివారించాలి. అలాగే హెయిర్ కు ఉపయోగించే హీటింగ్ ప్రొడక్ట్స్ కు కూడా దూరంగా ఉండాలి. అలాగే ఎక్సటర్నల్ గా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్య వాతావరణంలో తిరగడం తగ్గించుకోవాలి.
నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్, వాల్యూమినస్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ పొందడం ప్రతి అమ్మాయి డ్రీమ్.
హార్మోనుల ప్రభావం, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అన్ బ్యాలెన్డ్ డైట్, మొదలగునవన్నీ మన జుట్టును మరింత బలహీనపరుస్తాయి. ఇది తర్వాత జుట్టు పల్చబడటానికి మరియు జుట్టు రాలడానికి కారణమవుతుంది. జుట్టు పల్చబడం అనేది ఈ మద్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. జుట్టు పల్చబడటం వల్ల జుట్టు చూడటానికి నిర్జీవంగా మరియు అందవిహీనంగా మార్చుతుంది. కొన్నిసందర్భాల్లో, బట్టతలకు గురిచేస్తుంది.
అటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా మనకు మనపూర్వీకులు కొన్ని ట్రెడిషినల్ రెమెడీస్ ను పరిచయం చేశారు. ఈనేచురల్ అండ్ ట్రెడిషినల్ రెమెడీస్ ను కొన్ని దశాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు పెరుగుదలను మరియు హెయిర్ వాల్యూమ్ ను పెంచడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
అటువంటి ట్రెడిషినల్ హోం రెమెడీస్ ను కొన్నింటిని ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరగింది. ఈ హోం రెమెడీస్. జుట్టు రాలడం తగ్గించి, అందమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
ఇలాంటి చౌకైన హోం రెమెడీస్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మరి అలాంటి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను బెటర్ గా, సేప్ గా ఎలా ఉపయోగించాలి . జుట్టు రాలడం తగ్గించి, హెయిర్ వాల్యూమ్ ను పెంచే ట్రెడిషనల్ అండ్ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం...

1. కొబ్బరి నూనెతో హెడ్ మసాజ్:
కోకనట్ ఆయిల్ లో రెండు ముఖ్యమైన గుణాలు ఉన్నాయి, లూరిక్ మరియు కాపరిక్ అనే యాసిడ్ గుణాలున్నాయి . ఇది జుట్టు రాలడం తగ్గించి, హెయిర్ వాల్యూమ్ పెంచడంలో చాలా స్టాంగ్ అండ్ బెస్ట్ నేచురల్ రెమెడీ . ఇది డ్యామేజ్ హెయిర్ రిపేర్ చేస్తుంది . హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది, జుట్టు పల్చబడటం నివారిస్తుంది.

2. తేనె అప్లై చేయాలి:
జుట్టు పల్చబడటానికి హెయిర్ రూట్స్ కారణమయితే , అందుకు కారణం న్యూట్రీషియన్ లోపమే. అందువల్ల , మీ జుట్టుకు రెగ్యురల్ గా తేనె అప్లై చేయడం వల్ల జుట్టు పల్చబడటం నివారించుకోవచ్చు . తేనెలో జుట్టుకు పోషణకు అవసరమయ్యే న్యూట్రీషియన్, విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు అవసరమయ్యే పోషకాలను అందివ్వడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . అయితే తేనెను నేరుగా కేశాలకు పట్టించుకుండా, కోకనట్ ఆయిల్ లేదా ఇతర ఎసెన్సియల్ ఆయిల్స్ తో మిక్స్ చేసి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ ను బలోపేతం చేస్తుంది. హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

3. అలోవెర జెల్ :
ఇది ఒక అద్భుతమైన మెడికల్ ప్లాంట్ . ఇది ఒక అద్భుతమైన హెర్బల్ మూలిక. ఇది వివిధ రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది . జుట్టులో తేమ కోల్పోవడం మరియు న్యూట్రీషియన్స్ లోపించడం వల్ల జుట్టు మరింత బలహీనంగా మారుతుంది . దాంతో ఒకే సారి జుట్టు రాలడం, జుట్టు పల్చబడుట జరుగుతుంది . అలోవెర జెల్ ను రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు తగిన పోషణను అందించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

4. ఆమ్లా:
ఈ ఎపెక్టివ్ మెడిసినల్ హెర్బ్, ఈట్రెండిషినల్ హెర్బ్ ను అమ్మమ్మల కాలం నుండి దీన్ని ఉపయోగిస్తున్నారు. . ఇందులో గొప్ప ఔషధగుణాలు మాత్రమే కాదు, సౌందర్య గుణాలు కూడా దాగున్నాయి . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మ్యాజిక్ జరుగుతుంది. ఆమ్లా పౌడర్ లో విటమిన్స్, న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉన్నాయి. ఆమ్లా పౌడర్ ను రెగ్యులర్ హెయిర్ ప్యాక్స్ లో ఉపయోగించడం వల్ల హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది . జుట్టు పల్చగా మారడం తగ్గిస్తుంది మరియు హెయిర్ బలహీనంగా మారకుండా , స్ట్రాంగ్ గా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

5. పొటాటో జ్యూస్ :
ఇది పురాతన కాలం నుండి బాగా పాపులర్ అయినటువంటి హోం రెమెడీ. ఈ బంగాళదుంప రసం జుట్టును ఒత్తుగా మార్చుతుంది . ఇందులో ఉండే ముఖ్యమైన విటమిన్స్, మినిరల్స్ జుట్టుకు అవసరమయ్యే తేమను మరియు పోషణను అందిస్తుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది మరియు హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

6. ఆముదంతో హెడ్ మసాజ్:
హెయిర్ ఫాల్ తగ్గించడంలో ఆముదం గ్రేట్ గా సనిచేస్తుంది, ఆముదంను తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా రెగ్యలర్ గా చేస్తుంటే , జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే వీక్ అండ్ డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది . ఆముదంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ ను ఎక్సటర్నల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది . దాంతో హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది.

7. ఎగ్ మాస్క్:
కొన్ని దశాబ్దాల నుండి ఈ రెమెడీ కూడా వాడుకలో ఉన్నది. ఇది అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది , ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గిస్తుంది. ప్రోటీనులకు ఇది ఒక గొప్ప మూలం . ఇది నేచురల్ గా హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.



Click it and Unblock the Notifications











