Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
ఆలివ్ ఆయిల్ + బాదం ఆయిల్ తో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్
మనకు ప్రకృతి సిద్దంగా అందుబాటులో ఉండే పదార్థాలు ఎంత విలువైనో వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటే తప్ప మనకు తెలియదు. ప్రకృతిలో మనకు అందుబాటులో ఉండే కొన్ని నేచురల్ రెమెడీస్ మీ స్కిన్ మరియు హెయిర్ ను రేడియంట్ గా మార్చుతాయంటే ఆశ్చర్య పడాల్సిందే? అటువంటి నేచురల్ పదార్థాల్లో బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ . ఈ రెండింటి కాంబినేషన్ లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ దాగున్నాయి.
బాదం పాలతో ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు
మన ఎప్పుడూ అందం విషయంలో కాంప్రైజ్ అవ్వము కాబట్టి, చర్మం, జట్టు ఆరోగ్యంగా, అందగా ఉండాలని కోరుకుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని అసాధరణమైన కారణాల వల్ల చర్మం కానీ, జుట్టు కానీ వాటి సహజత్వాన్ని కోల్పోయి, నిర్జీవంగా కనబడుతాయి. అందుకు కారణం స్కిన్, హెయిర్ పట్ల సరైన బ్యూటీ కేర్ తీసుకోకపోవడం, కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వడం. ఇంకా వయస్సు రిత్యా మార్పులు జరగవచ్చు !
జుట్టు ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు బెస్ట్ ఆయిల్
అందువల్ల, మీ చర్మం మరియు జుట్టులో కోల్పోయిన అందాన్ని తిరిగి పొందడానికి, కొంచెం ఎఫెర్ట్ పెట్టాల్సిందే. కాస్త సమయాన్ని గడపాల్సిందే. అప్పుడే మీరు కోరుకు అందం మీరు పొందుతారు. ప్రకృతిలో నేచురల్ పదార్థాలు చాలానే ఉన్నాయి, ఇవి చర్మానికైనా...జుట్టుకైనా చాలా నేచురల్ గా పనిచేస్తాయి. నేచురల్ గానే మంచి ఫలితాలను అందిస్తాయి. అటువంటి నేచురల్ పదార్థాల్లో ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తో 12 అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు!

జుట్టు రాలడం తగ్గిస్తుంది :
బాదం, ఆలివ్ ఆయిల్ ను రెండింటిని మిక్స్ చేసి జుట్టు అప్లై చేసి, మసాజ్ చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది.

హెయిర్ వాల్యుమ్ పెంచుతుంది:
ఆలివ్ , బాదం ఆయిల్ కాంబినేషన్ ఆయిల్ ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు నేచురల్ గా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:
హెయిర్ ఫాలిసెల్స్ ను ఉత్తేజం చేసి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది, ఈ నేచురల్ బ్యూటీ మాస్క్ హెల్తీ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది:
ఈ నేచురల్ బ్యూటీ మాస్క్ తలకు పోషణను అందిస్తుంది, ఇది హెయిర్ బ్రేక్ అవ్వకుండా నివారిస్తుంది. జుట్టు చిట్లకుండా నివారిస్తుంది.

చిక్కు తగ్గుతుంది
బాదం, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ నేచులర్ గా చిక్కు పడనివ్వకుండా నివారిస్తుంది. ఇది జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది. ఇది జుట్టును స్మూత్ గా మార్చుతుంది.

జుట్టుకు షైనింగ్ ను అందిస్తుంది
ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మిశ్రమం జుట్టుకు నేచురల్ రేడియంట్ ను అందిస్తుంది. ఇది జుట్టుకు ఎక్కువ షైనింగ్ ను అందిస్తుంది.

స్కార్స్ ఫేడ్ అవుతాయి
మొటిమలతో వల్ల ఏర్పడిన మచ్చలు, చిన్న గాయాల వల్ల ఏర్పడానికి మచ్చలను నివారించడంలో మరియు ముడుతలను మాయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

స్కిన్ కు తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది
బాదం, ఆలివ్ ఆయిల్ మిశ్రమంను చర్మానికి అప్లై చేయడం వల్ల, చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. చర్మం మాయిశ్చరైజింగ్ గా మరియు హైడ్రేషన్ తో ఉంటుంది.

మేకప్ తొలగిస్తుంది
ఆలివ్ ఆయిల్+బాదం ఆయిల్ మిశ్రమం నేచురల్ మేకప్ రిమూవర్ గా పినచేస్తుంది. ఇది చర్మంను సురక్షితంగా ఉంచుతుంది. కెమికల్స్ మిక్స్ చేసిన మేకప్ రిమూవర్స్ కంటే ఈ నేచురల్ రిమూవర్ సురక్షితమైనది.

ముడుతలను తగ్గిస్తుంది
ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మిశ్రమంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి , ఇవి స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. ఇంకా ముడుతలను తగ్గిస్తాయి.

ఎక్జిమాను తగ్గిస్తుంది
ఈ నేచురల్ బ్యూటీ మాస్క్ ఎక్జిమాను నివారిస్తుంది, ఇది చర్మానికి డీప్ గా పనిచేసి, మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, స్కిన్ డ్రై నెస్ ను నివారిస్తుంది.

కాళ్ల పగుళ్లను నివారిస్తుంది
ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్లో స్కిన్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాళ్ళ పగుళ్లను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే కాళ్ళకు మాయిశ్చరైజింగ్ ను మరియు పోషణను అందిస్తుంది. .



Click it and Unblock the Notifications
