Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
తెల్లజుట్టు నివారణకు గ్రేట్ హోం రెమెడీస్ ...
తెల్లజుట్టు వయస్సైన వారికి లక్షణంగా చూపెడుతుంది. అయితే, బాధకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఎక్కవగానే ఉన్నారు . చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటానికి కారణాలు అనేకం.
ముఖ్యంగా ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో స్ట్రెస్, పొల్యూషన్, హెరిడిటి, జెనిటిక్స్, పోషకాల లోపం మరియు స్మోకింగ్. ఇంకా ఈ రోజుల్లో యుక్తవయస్సులోని వారు హానికరమైన పొల్యూషన్ కు గురి అవుతున్నారు. ఫలితంగా చిన్నవయస్సులోనే తెల్లజుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

జుట్టు రంగుకు ప్రధానకారణం మెలనిన్. ప్రతి హెయిర్ ఫోలిసెల్స్ లో సెల్స్ లో ఈ పిగ్మెంట్ ఉంటుంది . ఈ తెల్లజుట్టును నివారించడానికి ఒకే ఒక మార్గం నేచురల్ హోం రెమెడీస్. హెర్బల్ రెమెడీస్ లో నువ్వుల నూనె, మెంతులు మరియు ఆవనూనె వంటివి తెల్లజుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇదేవిధంగా మరికొన్ని హో రెమెడీస్ కూడా ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయబడినది . వీటిని రెగ్యులర్ బ్యూటీకేర్ లో ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నుండి త్వరగా మంచి ఫలితం ఉంటుంది. మరి ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఆమ్లా: ఉసిరికాయ లోని హెయిర్ బెనిఫిట్స్ మనకు తెలిసినవే. ఉసిరికాలో జుట్టును స్ట్రాంగ్ గా మరియు ఒత్తుగా మరియు డార్క్ గా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు చిన్న వయస్సులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. వీటిని నేరుగా తినడం లేదా ఆయిల్లో మరిగించి తలకు అప్లై చేయవచ్చు.

కొబ్బరి నూనె: మీ జుట్టుకు సరిపడా ఆయిల్ తీసుకుని దానిలో.. 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. తర్వాత కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ టీ: రెండు టేబుల్ స్పూన్ల టీని ఉడికించాలి. ఇందులో చక్కెర, పాలు కలపకూడదు. ఈ నీళ్లు తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత జుట్టు అంతటికీ రాసుకోవాలి. తర్వాత షాంపూ ఉపయోగించకుండా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

హెన్నా:తాజా హెన్నా పేస్ట్ కి 3 టేబుల్ స్పూన్ల ఉసిరికాయ పొడి కలపాలి. దానికి 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, కొంచెం నీళ్లు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి పూర్తీగా ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే జుట్టు నల్లగా మెరిసిపోతుంది.

కాఫీ : కాఫీని కూడా నేచురల్ డై హెయిర్ గా ఉపయోగిస్తుంటారు. కాఫీ గ్రే హెయిర్ ను కవర్ చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి.

అల్లం: తేనెతో మిక్స్ చేసి అల్లంను రోజూ కొద్దిగా తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు నేచురల్ రంగు వస్తుంది.



Click it and Unblock the Notifications