Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
మీ హెయిర్ టైప్.. మీ ఆరోగ్యాన్ని ఎలా వివరిస్తుంది ?
మనందరికీ.. జుట్టు రకరకాలుగా ఉంటుంది. కొంతమంది డ్రై హెయిర్ ఉంటే.. కొంతమంది చుండ్రు సమస్యతో బాధపడతారు. అలాగే జుట్టు రాలే సమస్య.. చుండ్రు వల్ల తలలో దురద వంటి రకరకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నీ... అనేక అనారోగ్య సమస్యలకు కారణమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
జుట్టు శరీరంలోని భాగమే. కాబట్టి ఇవి.. మన ఆరోగ్యాన్ని తెలుపుతాయి. తరచుగా వింటూ ఉంటాం.. కొన్ని వ్యాధి లక్షణాల్లో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ తో బాధపడేవాళ్లకు జుట్టు పూర్తీగా రాలిపోతుంది. అలాగే.. మరికొన్ని వ్యాధి లక్షణాల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. కాబట్టి.. ఇప్పుడు ఎలాంటి జుట్టు తత్వం ఉన్నవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురవుతుందో చూద్దాం.. అసలు జుట్టు టైప్.. ఆరోగ్య పరిస్థితిని ఎలా వివరిస్తుందో చూద్దాం..

డ్రై హెయిర్
జుట్టు చిట్లిపోవడానికి, డ్రైగా మారడానికి స్టైలింగ్ టూల్స్ కారణం అయి ఉండవచ్చు. అలాగే.. జుట్టు బలహీనంగా మారడం కూడా.. డీహైడ్రేషన్ కి కారణమవుతుంది.

ఏం చేయాలి ?
ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టుని నివారించవచ్చు. అలాగే.. ఆల్కహాల్, పంచదార, కెఫీన్ కి దూరంగా ఉండాలి.

చుండ్రు
చుండ్రు అనేది చాలా సాధారణ సమస్య. అయితే పెద్ద ప్రమాదమేమీ లేదు. ఇమ్యున్ సిస్టమ్ వీక్ గా ఉన్నవాళ్లలో.. డాండ్రఫ్ సమస్య ఉంటుంది.

పరిష్కారం
మెడికేటెడ్ డాండ్రఫ్ షాంపూలో సలిసైలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది న్యాచురల్ యాంటీ ఫంగల్ ఏజెంట్ లా పనిచేస్తుంది. కాబట్టి పెరుగు, ఓట్స్, వెల్లుల్లి, పంచదార, మష్రూమ్స్ ని డైట్ లో చేర్చుకుంటే.. ఇమ్యునిటీ పెరుగుతుంది.

ప్రీమెచ్యూర్ గ్రేయింగ్
20లలోనే మీ జుట్టు తెల్లబడుతోంది అంటే.. మీ ఫ్యామిలీలో ఎవరికీ.. ఈ సమస్య లేదు అంటే.. డయాబెటిక్, థైరాయిడ్ సమస్యలకు సంకేతం. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి.

సూచన
అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి, అన్ హెల్తీ ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలి. విటమిన్ బి ఫుడ్ తీసుకోవడం వల్ల. హెయిర్ హెల్త్ బావుంటుంది. మెడిటేషన్, యోగాతో ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

జుట్టు చిట్లిపోవడం
మీ జుట్టు చిట్లిపోతోందని గుర్తించారా ? మీజుట్టు పోషకాలను మిస్ అవుతోందని సంకేతం. కాబట్టి హెయిర్ థెరపీ చేయించుకోవాలి. ప్రొటీన్ షాంపూతో స్నానం చేయాలి.

ఫుడ్
బయోటిన్ రిచ్ ఫుడ్, హోల్ గ్రెయిన్స్, లివర్, ఎగ్ డైట్ లో చేర్చుకోవాలి. షుగర్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

జుట్టు రాలడం
60 నుంచి 100 వెంట్రుకలు రోజుకి కోల్పోవడం సాధారణం. కానీ అంతకంటే.. ఎక్కువ రాలుతున్నాయంటే.. అనీమియాకి సంకేతం. ఇది.. ఐరన్ లెవెల్స్ ని తగ్గినట్టు సూచిస్తుంది.

డైట్
ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలాగే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications