Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ హెర్బ్స్ పొడిబారిన మీ జుట్టుకి మంచివని మీకు తెలుసా??
పొడిబారి గరుకుగా ఉండే జుట్టు చాలామందిలో ఉండే సమస్యే.పొడి జుట్టు లో తేమ లోపించి నిర్జీవంగా కనిపిస్తుంది.హెయిర్ డ్రయ్యర్ లాంటి వేడి పరికరాలు అతిగా వాడటం,సూర్యరశ్మి,అతిగా తలస్నానం చేయడం,రసాయనాలు ఉన్న షాంపూల వాడకం మొదలయిన వాటి వల్ల జుట్టులో తేమ శాతం తగ్గి జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది.ఒక్కోసారి పొడి బారిన జుట్టు వంశపారపర్యంగా కూడా వస్తుంది.నిర్జీవంగా ఉండి అలా గాలికి ఎగురుతున్న జుట్టుని పట్టి ఉంచడం కూడా కష్టమే.జుట్టు ఆరోగ్యం కాపాడూకోవడం కోసం జుట్టుకి తగినంత తేమ అందడం చాలా ముఖ్యం.
అలా పిచ్చిగా ఎగురుతున్న జుట్టుతో తిరగాలని ఎవ్వరూ అనుకోరు కదా. జుట్టుకి తేమ అందించడం కోసం హెర్బల్ ఉత్పత్తులని లేదా సహజ సిద్ధమైన దినుసులని ఉపయోగించడం మంచిది.హెర్మల్ ఉత్పత్తులని ఉపయోగించడంవల్ల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. పొడిబారిన జుట్టుకి తేమ అందించి పట్టులా మృదువుగా మార్చడానికి హెర్బల్ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. వీటినిఉపయోగిస్తే జుట్టులో తేమ శాతం పెరిగి అలా నిర్జీవంగా ఎగరదు.ఈ హెర్బల్ ఉత్పత్తులు జుట్టు పొడిబారకుండా ఉండటానికి కావాల్సిన పోషకాలని అందిస్తాయి.పొడిబారి నిర్జీవంగా మారిన జుట్టుకి వాడాల్సిన హెర్బల్ ఉత్పత్తుల గురించి మీకు మేము ఈరోజు అందిస్తున్నాము.

మార్ష్‌మెల్లో వ్రేళ్ళు:మార్ష్‌మెల్లో వ్రేళ్ళు జుట్టుకి తగినంత తేమ ని అందించి జుట్టుని పట్టులా మారుస్తాయి.దీనిలోగల సహజ సిద్ధ గుణాలు చుండ్రుని, బాగా దురదపెట్టే మాడు తదితర వ్యాధుల నుండి రక్షిస్తాయి.మార్ష్ మెల్లో వ్రేళ్ళు సహజ సిద్ధంగా చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటాయి.
లికోరీస్ రూట్: దీనిలో ఉన్న అమైనో ఆసిడ్లు, పాలీ సాకరాయిడ్లు జుట్టుకి తగినంత తేమ అందిస్తాయి.లికోరీస్ రూట్ జుట్టు కుదుళ్ళని బలపరిచి జుట్టుకి సహజ సిద్ధమైన మెరుపునిస్తాయి.
ఎల్డర్ ఫ్లవర్: ఈ సుగంధ పుష్పాలు పొడిబారి నిర్జీవంగా ఉన్న జుట్టుకి తేమని అందిస్తాయి.ఈ పుష్పాలకి జుట్టుని మృదుత్వపరిచే గుణం ఉంది.ఇంకా హెయిర్ క్యూటికిల్(వెంట్రుక పై పొర)ని కూడా కాపాడుతుంది.ఈ పుష్పాలు మీ జుట్టుకి ఒక రకమైన సహజసిద్ధమైన మెరుపుని అందించి జుట్టుని కావాల్సిన రీతిలో అలంకరించుకోవడానికి అనుగుణంగా మారుస్తాయి.

పార్స్లీ: జుట్టు మృదుత్వం కోసం పార్స్లీ ని అనాదిగా ఉపయోగిస్తున్నారు.దీనిలో ఉన్న పోషకాలు, విటమిన్ల వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.ఇది మంచి కండీషనర్ కూడా.
కాంఫ్రే: కాంఫ్రే పొడి బారిన జుట్టుకి ఒక మంచి ఔషధం.ఇది జుట్టు కుదుళ్ళకి కావాల్సిన బలానిచ్చి జుట్టు చిట్లడాన్ని అరికడుతుంది. కోల్పోయిన జుట్టు కి తేమని అందించి తేమని కోల్పోకుణ్డా కాపాడుతుంది అందువల్ల పొడిబారి నిర్జీవంగా ఉన్న జుట్టుకి ఇది దివ్యౌషధం.



Click it and Unblock the Notifications