Latest Updates
-
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా!
అలోవెర(కలబంద)తో జుట్టు సాప్ట్ గా ..షైనీగా..నిగనిగలాడుతుంది..!
ఎన్నిరకాలుగా ప్రయత్నించినా జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏదో ఒకటి రాసుకోవడం కన్నా కలబందను ప్రయత్నించి చూడండి. మీ జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.
ఎన్నిరకాలుగా ప్రయత్నించినా జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏదో ఒకటి రాసుకోవడం కన్నా కలబందను ప్రయత్నించి చూడండి. మీ జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.

చాలామందికి ఎదురయ్యే సమస్య జుట్టు రాలడం. దీన్ని నివారించాలంటే.. నాలుగు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌నూనె, టేబుల్‌స్పూను తేనె వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లనుంచీ చివర్లవరకూ పట్టించుకోవాలి. అరగంట తరవాత చల్లనినీళ్లతో తలస్నానం చేసుకోవాలి. తలస్నానం అయ్యాక జుట్టంతా కొద్దిగా కండిషనర్ పట్టించి రెండుమూడు నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే రాలే సమస్య తగ్గడమే కాదు, జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.


రోజు విడిచి రోజూ తలస్నానం చేస్తున్నా కూడా కొందరి జుట్టు జిడ్డుగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కలబంద గుజ్జూ, గుడ్డు పచ్చసొన పూత తలకు వేసుకుని చూడండి. ఏం చేయాలంటే.. నాలుగు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జులో మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనె, రెండు పచ్చసొనలు వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ఏదయినా బ్రష్‌తో తలంతా పట్టించుకుని గంటా, గంటన్నర తరవాత రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో రెండుమూడుసార్లు ఈ పూత వేసుకుంటే గనుక జిడ్డు వదిలిపోయి, నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఒత్తుగానూ పెరుగుతుంది.

చుండ్రూ, తల్లో దురద.. లాంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయా.. ముప్పావుకప్పు కలబంద గుజ్జులో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నూనె, చెంచా చొప్పున కొబ్బరినూనె, నిమ్మరసం వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని కుదుళ్లకే కాదు.. జుట్టంతా పట్టించి గంటన్నర తరవాత తలస్నానం చేయాలి. తలస్నానం చేస్తున్నప్పుడల్లా ఈ పూత వేసుకుంటే గనుక చుండ్రూ.. దానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

చిన్నవయసులో తలలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తుంటాయి కొందరికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. గుప్పెడు చొప్పున వేపాకులూ, మందార ఆకులు తీసుకోవాలి. ఈ రెండింటినీ ముద్దలా చేసి, అరకప్పు కలబంద గుజ్జులో కలిపి తలకు రాసుకుని అరగంట తరవాత కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు నెరవడం తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
