Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
పొడవాటి జుట్టు కావాలా ? అయితే ఇవాల్టి నుండే ఈ 10 హోం రెమిడీస్ ఫాలో అవ్వండి..!
పొడవు జుట్టు పొందాలనే డ్రీమ్ మీకు ఉంటే.. ఇప్పుడు సూచించే రెమిడీస్ ని క్రమం తప్పకుండా ఫాలో అయితే.. చాలా గ్రేట్ గా పొందవచ్చు. టెస్ట్ చేసి, నిరూపించబడిన హోం రెమిడీస్ నే మీకు సూచించబోతున్నాం. వీటిని ఖచ్చి
మీకు పొడవాటి జుట్టు అంటే ఇష్టమా ? లాంగ్ హెయిర్ ఇష్టపడని వాళ్లు ఉండరు. ఎందుకంటే.. పొడవు జుట్టు ఉన్నవాళ్లు ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా ఎలా అయినా.. రెడీ అయిపోవచ్చు. కానీ.. పొట్టి జుట్టు ఉంటే.. కేవలం మోడ్రన్ గా మాత్రమే కనిపించవచ్చు. మీకు పొడవు జుట్టు కావాలంటే.. సింపుల్ చిట్కాలు మీ చెంత ఉన్నాయి.
చుండ్రును తగ్గించే 15 ఆయుర్వేదిక్ రెమెడీస్
అయితే ప్రస్తుత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కారణంగా.. పొడవు జుట్టు పొందడం అంత ఈజీ కాదు. కాబట్టి.. కొద్దిగా ఓపిక తీసుకుని, కెమికల్స్ లేని హోం రెమిడీస్ ప్రయత్నిస్తే.. న్యాచురల్ గా పొడవాటి జుట్టు పొందవచ్చు. పొల్యూషన్, అన్ హెల్తీ హ్యాబిట్స్ కారణంగా.. చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోంది.
బట్టతల సమస్యకు చెక్ పెట్టే పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్..!!
పొడవు జుట్టు పొందాలనే డ్రీమ్ మీకు ఉంటే.. ఇప్పుడు సూచించే రెమిడీస్ ని క్రమం తప్పకుండా ఫాలో అయితే.. చాలా గ్రేట్ గా పొందవచ్చు. టెస్ట్ చేసి, నిరూపించబడిన హోం రెమిడీస్ నే మీకు సూచించబోతున్నాం. వీటిని ఖచ్చితంగా ఫాలో అయి చూడండి.. మీ జుట్టు పొడవుగా మారిపోతుంది.

పొడవాటి జుట్టు కోసం హెయిర్ మాస్క్
1 కప్పు పొటాటో జ్యూస్
1 టీస్పూన్ తేనె
1 టీస్పూన్ ఎగ్ వైట్
* ఈ మూడు పదార్థాలను మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.
* తలకు అప్లై చేసిన 3-4 గంటల తర్వాత తలస్నానం చేయాలి.
* ఇలా వారానికొకసారి చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది.

పొడవాటి జుట్టు కోసం ఎగ్ వైట్ హెయిర్ మాస్క్
* ఒక టీస్పూన్ ఎగ్ వైట్
* ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్
* ఈ రెండు పదార్థాలను మిక్స్ చేయాలి.
* ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
* వారానికొకసారి రిపీట్ చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది.

పొడవాటి జుట్టు కోసం మేతి హెయిర్ మాస్క్
* ఒక టీస్పూన్ మెంతులు(మేతి)
* 2 టీస్పూన్స్ కోకనట్ మిల్క్
* మొదట మెంతులను నీళ్ళలో వేసి 5 గంటలు నానబెట్టాలి
* తర్వాత నీరు వంపేసి, మెంతులను మెత్తగా పేస్ట్ చేయాలి.
* మెంతి పేస్ట్ కు రెండు టీస్పూన్ల కొబ్బరి పాలు మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.
* ఈ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మిరాకిల్ బెనిఫిట్స్

పొడవాటి జుట్టు కోసం ఆమ్లా హెయిర్ మాస్క్
1 టేబుల్ స్పూన్ ఎండిన ఆమ్లా (ఎండిన ఉసిరికాయలు)
* 2 టేబుల్ స్పూన్స్ కోకనట్ ఆయిల్
* కొబ్బరి నూనెలో ఎండిన ఉసిరికాయ వేసి బాయిల్ చేయాలి.
* కొద్దిసేపు బాగా మరిగిన తర్వాత, వడగట్టి, గోరువెచ్చగా తలకు అప్లై చేయాలి.
* రాత్రుల్లో ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుంది.
* వారానికి రెండు సార్లు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పొడవాటి జుట్టు కోసం వెల్లుల్లి రెబ్బలు హెయిర్ మాస్క్
* 3 వెల్లుల్లి రెబ్బలు
* 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
*వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి, ఆలివ్ ఆయిల్లో వేసి వేడి చేయాలి.
* తర్వాత వడగట్టి, గోరువెచ్చగా తలకు అప్లై చేయాలి.
* ఈ చిట్కాను వారంలో రెండు మూడు సార్లు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పొడవాటి జుట్టు కోసం నిమ్మరసం హెయిర్ మాస్క్
* 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం
* 4 టేబుల్ స్పూన్ల కోకనట్ ఆయిల్
* ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి కొన్ని నొముషాల వేడి చేయాలి.
* గోరువెచ్చగా అయిన తర్వాత తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.
* 4-5 గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచిది

పొడవాటి జుట్టు కోసం అవొకాడో హెయిర్ మాస్క్
* 4 టేబుల్ స్పూన్ల అవొకాడో
* 4 టేబుల్ స్పూన్ల అరటిపండు
* ఈ రెండు పండ్లను బాగా పండినవి తీసుకోవాలి.
* ఈ రెండు పండ్లను మెత్తగా మ్యాష్ చేసుకోవాలి.
* తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
* ఈ హెయిర్ మాస్క్ ను వారంలో ఒకసారి రిపీట్ చేయాలి.

పొడవాటి జుట్టు కోసం ఉల్లిపాయ రసం హెయిర్ మాస్క్
* 1 కప్పు ఉల్లిపాయ రసం
* 2 టీస్పూన్ల తేనె
* ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.
* రాత్రి నిద్రించడానికి ముందు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి.
* ఉదయం తలస్నానం చేయాలి. వారంలో రెండు, మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పొడవాటి జుట్టు కోసం గ్రీన్ టీ హెయిర్ మాస్క్
* ఒక కప్పు గ్రీన్ టీ
* నీళ్ళలో గ్రీన్ టీ ఆకులు వేసి మరిగించాలి.
* చల్లార్చి తలకు , జుట్టు పొడవునా అప్లై చేయాలి.
* ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
* ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం.

పొడవాటి జుట్టు కోసం అరటి పండు హెయిర్ మాస్క్
* అరటి పండు
* బాగా పండిన అరటి పండును మెత్తగా మ్యాష్ చేయాలి.
* దీన్ని తలకు మరియు జుట్టు పొడవునా అప్లై చేయాలి.
* అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
* ఈ చిట్కాను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications