రేగిన జుట్టును కుదురుగా ఉంచే 10 హోంరెమెడీస్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కొంతమందికి జుట్టు తరచూ రేగిపోతూ ఉంటుంది. ఎంత దువ్వినా కుదురుగా ఉండదు. ఇటువంటి హెయిర్ అనేది మీ అప్పీయరెన్సును దెబ్బతీస్తుంది కూడా. ఎదో ఒక సమయంలో మనమందరం ఈ సమస్యను ఎదుర్కొనే ఉండుంటాము.

చిక్కు, తేమ లేకపోవటం లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వలన ఈ సమస్య ఎదురవుతుంది.

ఇటువంటి హెయిర్ కండిషన్ ను నివారించేందుకు అద్భుతమైన చిట్కాలు.

tips to handle flyaway hair

మీ జుట్టు కూడా ఇటువంటి సమస్యకు గురవుతూ ఉంటే ఈ ఆర్టికల్ ని చదవండి. ఈ రోజు బోల్డ్ స్కై లో ఇంటి వద్దే సులభంగా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రభావవంతమైన చిట్కాలను తెలియచేస్తున్నాము.

ఇందులో చెప్పబడిన రెమెడీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అందువలన శిరోజాలలో తగినంత తేమ నిలిచి ఉంటుంది. తద్వారా జుట్టు రేగకుండా కుదురుగా, అందంగా ఉంటుంది. అంతేకాకుండా, జుట్టు యొక్క టెక్చర్ కూడా మెరుగవుతుంది. తద్వారా, జుట్టు చిక్కు పడకుండా ఉంటుంది.

ఈ కింద చెప్పబడిన రెమెడీస్ లో ఏదైనా ఒక దానిని ఎంచుకుని తద్వారా శిరోజాల సౌందర్యాన్ని పరిరక్షించుకోండి.

ఈ రెమెడీస్ ని ఇక్కడ పరిశీలించండి:

1. అలో వెరా జెల్:

1. అలో వెరా జెల్:

అలోవెరా జెల్ లో శిరోజాల సౌందర్యాన్ని సంరక్షించే లక్షణాలు అనేకం. జుట్టు రేగిపోతూ ఉంటే అలోవెరా జెల్ ని వాడి జుట్టును కుదురుగా ఉంచవచ్చు. ఈ జెల్ లో లభించే సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఫ్రిజ్జీ హెయిర్ సమస్యను నిర్మూలించి రేగిపోతున్న జుట్టును కుదురుగా ఉంచుతాయి. కాస్తంత అలోవెరా జెల్ ను తీసుకుని దానిని రేగిపోతున్న జుట్టుపై అప్లై చేయండి. ఈ హోంరెమెడీ అనేది మార్కెట్ లో లభ్యమవుతున్న అనేక కాస్మెటిక్స్ కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2. పెట్రోలియం జెల్లీ

2. పెట్రోలియం జెల్లీ

జుట్టు రేగడాన్ని తగ్గించుకునేందుకు పెట్రోలియం జెల్లీ చిట్కాను ప్రయత్నిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కాస్తంత పెట్రోలియం జెల్లీని తీసుకుని దానిని శిరోజాలపై అప్లై చేస్తే తేమ అనేది తగినంత లభ్యమయి శిరోజాలు మృదువుగా అలాగే సిల్కీగా మారతాయి.

3. ఆల్మండ్ ఆయిల్:

3. ఆల్మండ్ ఆయిల్:

రేగిపోతున్న జుట్టును ఆల్మండ్ ఆయిల్ చిట్కాతో సంరక్షిస్తే అద్భుత ఫలితాలను గమనించవచ్చు. కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ ను తీసుకుని శిరోజాలపై అప్లై చేయండి. ఈ చిట్కా అనేది రేగిన జుట్టుకు అద్భుతంగా పనిచేయటంతో పాటు శిరోజాల సౌందర్యాన్ని పరిరక్షించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.

4. మయోన్నైస్

4. మయోన్నైస్

మయోన్నైస్ అనేది శిరోజాలకు ప్రయోజనాలను చేకూర్చే ప్రోటీన్. జుట్టు రేగిపోయే సమస్యను నిర్మూలించి శిరోజాల ఆకృతిని సంరక్షిస్తుంది. అంతేకాకుండా, శిరోజాలను మృదువుగా చేస్తుంది. ఈ హోంరెమెడీతో వారానికి ఒకసారి మీ శిరోజాలను సంరక్షించడం ద్వారా శిరోజసంపదను కాపాడుకోవచ్చు.

5. ఆపిల్ సిడర్ వినేగార్

5. ఆపిల్ సిడర్ వినేగార్

అన్ని రకాల జుట్టు సమస్యలకు సరైన పరిష్కారం ఆపిల్ సిడర్ వినేగార్ తో లభిస్తుంది. ఇందులో, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు రేగడాన్ని అరికడతాయి. వారానికొకసారి, మీ శిరోజాలను ఆపిల్ సిడర్ వినేగార్ తో కడిగితే మీ శిరోజాలకు తగినంత తేమ లభిస్తుంది. అంతేకాకుండా, మీ శిరోజాలు ఎంతో అందంగా ఉంటాయి.

6. పెరుగు

6. పెరుగు

జుట్టు రేగిపోయే సమస్య తీవ్రతరంగా మారుతున్నప్పుడు పెరుగుతో మీరు అద్భుత పరిష్కారాన్ని పొందవచ్చు. పెరుగు ద్వారా మీ శిరోజాలకు తగినంత తేమ లభిస్తుంది. అలాగే, జుట్టు మూలాల నుంచి పోషణ లభిస్తుంది. వారానికి రెండుసార్లు, తాజా పెరుగుని శిరోజాలకు పట్టిస్తే జుట్టు రేగిపోయే సమస్య తగ్గుతుంది. అలాగే, శిరోజాలు సిల్కీగా, ఆరోగ్యంగా మారతాయి.

7. బీర్

7. బీర్

జుట్టు రేగిపోవటాన్ని అరికట్టడంలో బీర్ రెమెడీ అనేది అద్భుతంగా పనిచేస్తుందని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఈ రెమెడీని వాడటం ద్వారా మృదువైన శిరోజాలను సొంతం చేసుకోవచ్చు. ఇందులో లభించే విటమిన్ బి అనేది శిరోజాలకు తగినంత తేమను అందిస్తుంది. అలాగే, శిరోజాలకు సంపూర్ణ పోషణని కూడా అందిస్తుంది. వారానికి ఒకసారి మీ శిరోజాలను బీర్ తో రిన్స్ చేస్తే జుట్టు రేగిపోయే సమస్య మళ్ళీ తలెత్తదు.

8. తేనె:

8. తేనె:

తేనెని ప్రసిద్ధి చెందిన హెయిర్ కేర్ ఇంగ్రీడియెంట్ గా పరిగణించవచ్చు. దీనిని వాడటం వలన శిరోజాలలో తేమ శాతం తగినంత ఉంటుంది. జుట్టు రేగిపోవటాన్ని నివారించేందుకు అవసరమైన గుణాలన్నీ తేనెలో పుష్కలంగా లభిస్తాయి. కాస్తంత తేనెని తీసుకుని మీరు వాడే వీక్లీ మాస్క్ లో జోడించి ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోండి.

9. ఎగ్ వైట్

9. ఎగ్ వైట్

ఎగ్ వైట్ లో శిరోజాల సమస్యలను అరికట్టే అనేక గుణాలున్నాయి. దీనిని సరైన విధంగా వాడటం ద్వారా శిరోజాలను మృదువుగా మార్చుకోవచ్చు. ఇందులో శిరోజాలకు ప్రయోజనాలు చేకూర్చే ప్రోటీన్ లభిస్తుంది. అందువలన రేగిపోతున్న జుట్టు సమస్యను సులభంగా నిరోధించవచ్చు. ఒక ఎగ్ వైట్ ను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమంతో వారానికొకసారి మీ శిరోజాలకు సంరక్షణని అందించండి. ఇలా చేస్తే అద్భుతమైన శిరోజాలు మీ సొంతమవుతాయి.

10. విటమిన్ ఈ ఆయిల్:

10. విటమిన్ ఈ ఆయిల్:

ఈ రెమెడీస్ ల జాబితాలో ఆఖరిది విటమిన్ ఈ ఆయిల్ రెమెడీ. చిరాకు కలిగించే రేగిన జుట్టు సమస్య నుంచి మీకు ఉపశమనం అందించేందుకు ఈ రెమేడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ శిరోజాలకు తగినంత తేమను అందించి మాయిశ్చర్ లాస్ ను తగ్గిస్తుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ నుంచి ఆయిల్ ను సేకరించి దీనిని మీ శిరోజాలపై అప్లై చేయండి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటించడం ద్వారా ఆశించిన ఫలితం పొందవచ్చు.

English summary

10 At-home Remedies To Keep Flyaway Hair In Place

One of the most common factors for frizzy hair is lack of moisture or static electricity. There are several ways to get over this issue and the best remedy is by using homemade ingredients. Almond oil, aloe vera gel, etc., can help reduce flyaway hair and keep them in place.
Story first published: Saturday, January 20, 2018, 8:30 [IST]
Subscribe Newsletter