Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
అతివల ముఖారవిందంలో ఇట్టే ఆకర్షించే నయనాల కోసం..

హడావుడి పడకుండా.. కాస్త సమయం కల్పించుకుని మరీ షాపింగ్ చేయండి. కంటి మేకప్ ఎంపికలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు రెండున్నాయి. నాచురల్ లేదా ప్రిజర్వేటివ్ ఫ్రీ.. అని కొన్నిరకాల ఉత్పత్తులపై రాసుంటుంది. అలాంటి వాటిని కొనకూడదు. వీటిపై త్వరగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆ తర్వాత కంటి ఇన్‌ఫెక్షన్ తప్పదు. అలాగే ట్రయల్‌పేరుతో మేకప్‌ను నేరుగా కళ్లపై వేసుకుని చూడకూడదు. మీ ముందు ఎందరో ప్రయత్నించి ఉంటారు. కాబట్టి చేతిపై రాసుకుని చూడండి. కాస్త ఖరీదు ఎక్కువైనా నాణ్యమైన వాటిని కొనడమే అన్నివిధాలా మంచిది.
మీ మేకప్‌సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు. కంటి మేకప్ ఉత్పత్తుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. స్నేహితులకే కాదు.. తోబుట్టువులకు కూడా ఇవ్వకూడదు. అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదు కూడా. ఇది వాటి తాలూకు బ్రష్‌లకూ వర్తిస్తుంది.
అలాగే కనుబొమలకు వాడే మస్కారా రంగుతో సూట్ అయ్యే లిప్‌స్టిక్ ను వాడడం వల్ల చూడటానికి అసహజంగా అనిపించదు. మస్కారా బాగా డార్క్ గా ఉంటే మద్యస్థంగా ఉండే లిప్ స్టిక్ వేసుకోవాలి. ఒక్కసారి అద్దంముందు నిలబడి ఐబ్రోస్ కు, కనురెప్పలకు షేడ్ లను వేసుకుని చూడండి. ఇలా చేయడంవల్ల వివిధ రకల షేడ్‌ల ద్వారా మీ అప్పియరెన్స్ ఎలా మారిపోతుందో మీకే అర్థమవుతుంది.
మస్కారాను మరీ ఎక్కువ లేయర్స్‌గా మేకప్ చేయకూడదు. దీనివల్ల అది ముద్దలాగా తయారై వున్నా అందాన్ని కూడా చెడగొడుతుంది. నిద్ర పోబోయే ముందుగా మస్కారాను, ఐ మేకప్‌ను వాష్ చేసుకోవటం మరవరాదు. మీకు అందుబాటులో మేకప్ రిమూవర్ లేనట్టయితే మంచి కంపెనీ తయారుచేసిన వాజలిన్ ను ఉపయోగించవచ్చు. పైన చెప్పిన జాగ్రత్తలను పాటించినట్లయితే, అందమైన మీనాల్లాంటి కళ్లు మీ సొంతమవుతాయి



Click it and Unblock the Notifications
