Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
చలికాలంలో చర్మం పొడిబారుతోందా.. స్కిన్ మాయిశ్చరైజ్ చేయండిలా?

1. చలికాలంలో సబ్బులు ఉపయోగించకుండా ఉండటం మంచిది. పొడిచర్మం ఉన్నవాళ్లు పాలల్లో ఉలవపిండిని కలిపి మర్దనా చేస్తే చర్మం పొడిబారకుండా సున్నితంగా ఉంటుంది.
2. వారానికోసారి గోరు నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత సున్నిపిండితో స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు రాలిపోవడమే కాదు చర్మం సున్నితంగా ఉంటుంది.
3. శనగపిండిలో నువ్వుల నూనె, కొద్దిగా పసుపు, తేనె, ఒక స్పూను పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై మర్దనా చేసి పది నిమిషాలు ఆగి కడిగేయాలి. చర్మం మృదువుగా తయారవుతుంది. దీనినే చేతులకూ కాళ్లకూ ఉపయోగించవచ్చు.
4. శీతాకాలంలో దాహం ఎక్కువగా లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి.
5. బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తరువాత గోరు నీటితో స్నానం చేసి తిరిగి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
6. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్‌వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
7. చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బును కాకుండా సున్నుపిండిని ఉపయోగించాలి. అంతేకాదు ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత వెనిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
8. గ్లిజరిన్ లో రోజ్ వాటర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లైచేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
9. పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని మొఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
10. తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని మొఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.



Click it and Unblock the Notifications
