Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఆగష్టు 17న సూర్యుడు తన సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. చాలా ఏళ్ల తర్వాత సింహ రాశిలో సూర్యుడు, కేతువు సంయోగం కానుంది. ఈ గోచారం చాలా ప్రత్యేకం కావడంతో శక్తివంతమైన ఈ కలయిక కొన్ని రాశుల వారికి తమ జీవితంలో రాజ యోగం పట్టనుంది. అదృష్టం వారి ఇంటి ముందే తిష్ట వేయనుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..

సింహ రాశి
సింహ రాశిలో సూర్య- కేతు సంయోగం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదం కానుంది. వీరిలో ఆత్మవిశ్వాసం మరింత పెరగడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తిపరంగా చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సూర్యుని ప్రభావంతో అదృష్టం తోడుగా ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీ సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయం కానున్నాయి. దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది.
కన్యా రాశి

సూర్య- కేతు సంయోగం కన్యారాశి వారికి కొత్త ఆదాయ మార్గాలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా మీరు పడిన కష్టానికి వంద శాతం ప్రతిఫలం అందుకుంటారు. దీంతో ఆత్మ విశ్వాసం బలపడుతుంది. ఆర్థికంగా వచ్చిన లాభాలతో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు నచ్చిన రంగంలో గుర్తింపు పొందుతారు. వ్యాపారపరంగా అనుభవం మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన పనులు చేస్తూ బిజిగా గడుపుతారు.
మకర రాశి
సింహ రాశిలో అరుదుగా సంభవించే సూర్య- కేతు సంయోగం మకర రాశి వారిపైన పాజిటివ్ రిజల్ట్స్‌ను ఇస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతారు. మెరుగైన అవకాశాలు అందుకుంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పూర్తి చేసుకుంటారు. ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రకమాల్లో పాల్గొని మానసికంగా మనశ్శాంతిని, సంతోషాన్ని పొందుతారు. కుటుంబీకుల నుంచి సపోర్ట్ అందుకుంటారు. వ్యాపారరంగానికి సంబంధించి పనుల్లో గెలుపు మీదే. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ నిస్వార్థంగా మీ బాధ్యతలను నెరవేర్చినట్లయితే చేపట్టే ప్రతి పనిలో అదృష్టం మీదే..
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
